కాంగ్రెస్ లో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.
రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా తిరుగుతూ,పేదల సమస్యలు తెలుసుకుంటున్నారు.
50 ఏళ్ల తర్వాత దళితుడిని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నాడు.
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాక దళితుడైన మల్లిఖార్జున ఖర్గే కి మద్దతు ఇవ్వడం జరిగింది.
2 వారాల్లో మల్లిఖార్జున ఖర్గే కొత్త అధ్యక్షుడు అవబోతున్నాడు.
కార్పొరేట్ శక్తులు కొత్త వ్యక్తిని తెచ్చాయి. ఆయన నాకూ తెలీదు. హైదరాబాద్ కి నిన్న వచ్చాడు.
హైదరాబాద్ లో జెండాలు వెలిశాయి. వాటిని పెట్టిన వారెవరో తెలీదు.
శశిథరూర్ ఓ అదృశ్య శక్తి. ఆయన రూపంలో బిజెపి శక్తి వస్తోంది.
కోటీశ్వరుడైన శశిథరూర్ హైదరాబాద్ వచ్చి, తనను AICC అధ్యక్షుడిని చేయాలని కోరడం సరికాదు.
శశిథరూర్ న్యూయార్క్ లో పుట్టి,పెరిగిన వ్యక్తి. అదృష్టవశాత్తు ఎంపీ అయ్యాడు.
మల్లిఖార్జున ఖర్గే వివాదాస్పద వ్యక్తి కాదు. చాలా మంచి మనిషి, . సౌమ్యుడు. కాంగ్రెస్ లో అందరూ ఆయన్ని ఇష్టపడుతున్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక లో మొత్తం 9000 ఓట్లు ఉంటే, అందులో ఒకే ఒక్క ఓటు మినహా, మిగిలిన అన్నీ ఓట్లు మల్లిఖార్జున ఖర్గే కి పడతాయి.
శశిథరూర్ దళిత వ్యతిరేకి, నిన్నకాక మొన్న కాంగ్రెస్ లోకి వచ్చిన వ్యక్తి. ఆయన ప్రయత్నాలు సాగవు.
కాంగ్రెస్ పార్టీ లో ఉన్న SC, ST,OBC, మైనార్టీ, OCలందరూ శశిథరూర్ ని ఇష్టపడటం లేదు. ఖర్గే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ, ఆయనకు తమ పూర్తి మద్దతు తెలుపుతున్నారు.
శశిథరూర్ కాంగ్రెస్ అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలి. నామినేషన్ ఉపసంహరించుకోవాలి.
రాహుల్ గాంధీ గొప్ప భావాలు గల వ్యక్తి.
చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నాడు.
2024లో కేంద్రంలో UPA ప్రభుత్వ ఏర్పాటు ఖాయం.
బిజెపి 100 సీట్లకు పరిమితం కాక తప్పదు.
దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయి. రోజుకు 100 సంపాదన లేనివాడు, పూట భోజనం లేని వాడు ఉన్నాడు.
దేశంలో 60 కోట్ల మంది ఆకలితో నిద్ర పోతున్నారని ప్రపంచ ఆహార సంస్థ లెక్కలు చెబుతున్నాయి.
కాంగ్రెస్ హయాంలో 20 శాతం ఉన్న ఆకలి, బిజెపి పాలనలో 40 శాతానికి పెరిగింది.
పేదల కడుపు నింపడంలో బిజెపి విఫలం.
పీవీ 1971 ముఖ్యమంత్రిగా సోషలిస్టు విధానాలతో ఆనాడు భూములు పంచింది కాంగ్రెస్.
1991లో పీవీ ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తెచ్చాడు. ఇప్పుడు మోడీ సంస్కరణలు పేరుతో గోడలు బద్దలు కొట్టాడు.
సరళీకృత విధానాలు తో కాంగ్రెస్ ఓడిపోయింది.
కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల ఐక్యత అవసరం.
కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం చేసినప్పుడే యుపీఏ తిరిగి అధికారంలోకి వస్తుంది.
వాజ్‌పేయ్ ని ఒక్క ఓటుతో ఓడించాము.
2024లో బిజెపి ని ఓడించి, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తేవడం ఖాయం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
బిజెపి పాలనలోగ్యాస్ ధర 1200/
కాంగ్రెస్ అధికారంలో వస్తే రూ. 500/ కే గ్యాస్ అందిస్తాం.
రైతు రుణమాఫీ 3 లక్షలు వరకు అమలు చేస్తాము.