సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఉత్తర కాలిఫోర్నియాలోని మిల్ పిటాస్ నగరంలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో శనివారం నాడు ప్రవాస ప్రముఖులు, వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో లోని భారత కాన్సులేట్ జనరల్ గౌరవనీయులు డా. టి . వి. నాగేంద్రప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భారతీయుడిగానే గాక, సాటి తెలుగువాడిగా తనకెంతో గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు.
సిలికానాంధ్ర కార్యవర్గం డా. హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను గుఱ్ఱపు బగ్గీలో విశ్వవిద్యాలయానికి వేడుకగా తీసుకునివచ్చారు. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అధిపతి డా. కూచిభొట్ల ఆనంద్, చీఫ్ అకడమిక్ ఆఫీసర్ చమర్తి రాజు స్వాగతం పలికారు. నాగేంద్రప్రసాద్, డా. హనిమిరెడ్డి విగ్రహాన్నీ, లోహ ఫలకాన్ని ఆవిష్కరించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ మాట్లాడుతూ 6సంవత్సారాల క్రితం ఇదే రోజున విశ్వవిద్యాలయ భవనం గృహప్రవేశం జరిగిందని, డా. హనిమిరెడ్డి దాతృత్వం వల్లనే ఆ రోజున ఈ భవనం కొనుగోలు సాధ్యపడిందని సభికులకు గుర్తు చేశారు.
వేదపండితుల వేదాశీర్వచనాల అనంతరం తనుగుల ఈష ప్రార్ధనా గీతం, అయ్యగారి అనఘ వయలిన్ వాద్య కచేరి, మాధవపెద్ది మూర్తి నృత్యం సభికులను ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం డా.హనిమిరెడ్డి, విజయలక్ష్మి దంపతులను ఘనంగా సన్మానించారు. డా.హనిమిరెడ్డికి “సిలికానాంధ్ర శ్రీకర” అనే బిరుదు ప్రదానం చేశారు.
కాంగ్రెస్ మాన్ రో ఖన్నా, కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా, కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ సభ్యుడు డేవ్ కార్టజ్ లు వారికి తమ కార్యాలయాల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. తదితరులు పాల్గొన్నారు.
డా.హనిమిరెడ్డి మాట్లాడుతూ తనకు మాటలు రావట్లేదని, తనపై చూపిన ప్రేమ, అభిమానం తానెప్పటికీ మరిచిపోలేనని చెప్పారు. చదువు అన్న మూడక్షరాలే ఎక్కడో భారతదేశంలోని ఒక పల్లెటూరులో పుట్టిన తనను ఇంతగా ఎదిగే అవకాశం కల్పించిందని, ఆ చదువు అందరికీ అందుబాటులోకి తేవడానికే, తాను ఎన్నో విద్యాసంస్థలకు దానధర్మాలు చేస్తూ తనవంతు సహాయం అందిస్తున్నానని సభికుల హర్షాతిరేకాల మధ్య ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డా. రఘునాథ్ రెడ్డి, కిరణ్ ప్రభ, కొండిపర్తి దిలీప్, కందుల సాయి, కోట్ని శ్రీరాం, సంగరాజు దిలీప్, పరిమి శివ, సింహాద్రి కిరణ్, ఉద్దరాజు నరేంద్ర, తనారి గిరి తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా డా.లకిరెడ్డి హనిమిరెడ్డి 80వ జన్మదినోత్సవ వేడుకలు
Related tags :