Sports

క్యాన్సర్‌కు దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కుమార్తె బలి

క్యాన్సర్‌కు దక్షిణాఫ్రికా క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కుమార్తె బలి

దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌కు పుత్రికా వియోగం కలిగింది. ఆయన కుమార్తె క్యాన్సర్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని డేవిడ్‌ మిల్లర్‌ స్వయంగా వెల్లడించాడు. ‘‘ మై లిటిల్ రాక్‌స్టార్‌.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. నిన్నెప్పుడూ ప్రేమిస్తూనే ఉంటా.’’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్‌ వీడియోను పోస్టు చేశారు. భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ జరుగుతున్న నేపథ్యంలో డేవిడ్ మిల్లర్‌ ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్నాడు. ఆదివారం రాంచీ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో మిల్లర్‌ ఆడాల్సి ఉంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంతో ఉన్న సౌతాఫ్రికా జట్టులో తాజా ఘటనతో విషాదఛాయలు అలముకున్నాయి.