రూపాయిని పటిష్ఠస్థాయిలో నిలిపేందుకు విలువైన విదేశీ మారక నిల్వల్ని విచ్ఛలవిడిగా ఖర్చుచేసినా ఫలితం దక్కలేదు. భారత్ వద్దనున్న ఫారిన్ కరెన్సీ నిల్వలు కేవలం ఏడాదికాలంలో 110 బిలియన్ డాలర్ల మేర హరించుకుపోయాయి. కానీ ఇదే సమయంలో రూపాయి విలువ 73 స్థాయి నుంచి 82.43 స్థాయికి (12.8 శాతం) పతనమయ్యింది. 2021 సెప్టెంబర్ 3న 642.45 బిలియన్ డాలర్లున్న నిల్వలు 2022 సెప్టెంబర్ 30కల్లా రెండేండ్ల కనిష్ఠం 532.66 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోయాయి. 2020 అక్టోబర్ 2 తర్వాత ఇంత కనిష్ఠస్థాయికి తగ్గడం ఇదే ప్రథమం. ఈ నిల్వల్లో కరెన్సీ, బంగారం, ఎస్‌డీఆర్‌లు ఉంటాయి. వీటిలో అత్యధికభాగం కలిగిన కరెన్సీ నిల్వలు ఇదేకాలంలో 580 బిలియన్ డాలర్ల నుంచి 472.80 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ భారీ క్షణతకు కారణం చాలావరకూ రిజర్వ్‌బ్యాంక్ రూపాయి పతనాన్ని నిరోధించడానికి ఖర్చుచేయడమే. మరికొంత తరుగుదల నిల్వల డీవాల్యుయేషన్ కారణంగా జరిగింది. ప్రస్తుతం దేశం వద్దనున్న విదేశీ మారకం కేవలం 9 నెలల దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. గత ఏడాది ఇదే సమయంలో 15 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారకం ఉండేది.
ఎంత చేసినా…అగని రూపాయి పతనం
Related tags :