NRI-NRT

మాంచెస్టర్‌లో(UK) కూచిపూడి నాట్యోత్సవం

మాంచెస్టర్‌లో(UK) కూచిపూడి నాట్యోత్సవం

మాంచెస్టర్ (యూకే): PYDA : పిరమిడ్ యోగా డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యం లో మాంచెస్టర్ నగరం లోని ఫ్లిక్స్టన్ బాలికల పాఠశాల ప్రాంగణం లో కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ అట్టహాసం గా జరిగింది.

గత 3 సంవత్సరాల నుండి శ్రీమతి పద్మావతి మాంచెస్టర్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో కూచిపూడి నృత్యాన్ని బోధిస్తున్నారు. స్థానికం గా ఉండే ఎక్కువ శాతం విద్యార్థులు వృత్తి రీత్యా డాక్టర్స్ గా
మరియు IT ప్రొఫషనల్స్ గా వర్క్ చేస్తూ డాన్స్ ని చాల ఇష్టం గా నేర్చుకుంటున్నారు.

ఈ కార్యక్రమం లో విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు, కార్యక్రమానికి వచ్చిన అందరినీ ఎంతో ఆనంద పరిచాయి. మన కళలు, సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న
శ్రీమతి పద్మావతి పులమరశెట్టి గారిని అందరు ప్రశంసించారు.

PYDA: పిరమిడ్ యోగా డ్యాన్స్ అకాడమీని 2010లో వియత్నాంలో శ్రీమతి పద్మావతి పులమరశెట్టి స్థాపించారు. PYDA యొక్క ప్రధాన నినాదం కళలు మరియు
ధ్యానం ద్వారా ఆనందకరమైన జీవితాన్ని ప్రోత్సహించడం.

PYDA ప్రతి సంవత్సరం వియత్నాం, మలేషియా, దుబాయ్ మరియు కాంబోడియా, భారతదేశం మరియు ఇండోనేషియాలో కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

MRS. పద్మావతి పులమరశెట్టి ప్రతిభావంతురాలు అయిన కూచిపూడి నృత్య కారిణి మరియు ఉపాధ్యాయురాలు, ఆమె కూచిపూడి నృత్యంలో MA చేసి, యోగా సైన్స్లో డిప్లొమా పూర్తి చేశారు.
గత 20 సంవత్సరాల నుండి బ్రేడ్త్ మెడిటేషన్ (ఆనాపానసతి) సాధన చేస్తూ మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గా ధ్యాన తరగతులు నిర్వహిస్తున్నారు.

స్థానిక డెలిగేట్స్ ఆనంద్ చింతల, చాణక్య రాజగోపాల్, డాక్టర్ గోపాల కృష్ణతో పాటు ట్రాఫోర్డ్ కౌన్సిల్ మేయర్ క్రిస్ బాయ్స్ను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు.

దాదాపు 150 మంది కి పైగా ఈ కార్యక్రమానికి హాజరుకాగా, కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయింది. విద్యార్థులందరూ ఒకే వేదికపైకి రావడం గర్వించదగ్గ ఘట్టం మరియు వారు తమ ప్రదర్శనలతో
గదిని దైవత్వంతో మరియు మంచి ప్రకంపనలతో నింపారు. విషయానందం, భజన ఆనందం మరియు బ్రహ్మానందం ల కలయికే పరిపూర్ణ ఆత్మనందం మరియు చివరగా ధ్యానం ద్వారా
పరిపూర్ణమైన ఆనందం అనే సందేశాలను ప్రజలకు చేర్చడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

PYDA యొక్క సేవలకు సంబంధించి ప్రచురించిన పుస్తకాన్ని ట్రాన్ఫర్డ్ మేయర్ విడుదల చేశారు. విద్యార్థి విద్యార్ధులు సంప్రదాయ పద్ధతిలో తమ గురువుకు కృతజ్ఞతలు తెలిపారు.