ఎన్నో ఉద్యమాలు చేశా.. ఏమిటీ ప్రవర్తన – పోలీసుల తీరుపై మండలి ఆగ్రహం..
తన రాజకీయ జీవితంలో ఎన్నో ఉద్యమాలు చేసామని కానీ ఎన్నడూ పోలీసులు నేడు వ్యవహరిస్తున్నట్లు ఎన్నడూ వ్యవహరించలేదని మండలి బుద్ధప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. తన ఇంటిలో నిరవధిక సత్యాగ్రహ దీక్ష చేపట్టిన బుద్ధప్రసాద్ ను దీక్ష విరమించి సహకరించాల్సిందిగా పోలీసు శాఖ తరుపున అవనిగడ్డ సీఐ శ్రీనివాస్ కోరారు.. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యల పై పోరాడేందుకు వెళ్ళే వారి విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు గురించి ముందు సమాధానం చెప్పాలని, గతంలో ఎప్పుడైనా నియోజకవర్గంలో ఇలా పోలీసులు కవాతులు చేసి ప్రజలను భయపెట్టారా అని ప్రశ్నించారు.. మీ ఆరోగ్యం గురించే మా ఆందోళన అని పోలీసులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించగా అవసరమయితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమని ప్రకటించారు.. పోలీసులు తమ ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తేనే దీక్ష గురించి ఆలోచిస్తానని బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు..
కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
సత్యాగ్రహ దీక్షలో ఉన్న బుద్ధప్రసాద్ వద్దకు పోలీసులు
ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని కోరిన సీఐ శ్రీనివాసు
కోడూరుకు బందరు నుంచి పోలీసులు వచ్చి కవాతు చేసే అవసరం ఏంటన్న బుద్దప్రసాద్
ఉగ్రవాదులు, తీవ్రవాదులు వస్తుంటే వచ్చినట్లు పోలీసులు వచ్చారు
కేవలం తహసీల్దారుకు అర్జీ ఇస్తామంటే ఆరు మండలాల్లో టీడీపీ శ్రేణులకు నోటీసులిచ్చారు
ఇంత హడావుడి ఎందుకో సమాధానం చెబితే విరమణ గురించి ఆలోచిస్తా