Politics

మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి 38 మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు

మునుగోడు.. కాంగ్రెస్ పార్టీకి 38 మంది స్టార్ క్యాంపెయిన‌ర్లు

మునుగోడు ఎన్నిక‌ల‌కు స్టార్ క్యాంపెయినర్ల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌

జాబితాలో కొండా సురేఖ, గీతారెడ్డి, రేణుకా చౌద‌రి, సీత‌క్క‌ల పేర్లు

లిస్టులో క‌నిపించ‌ని జ‌గ్గారెడ్డి పేరు

హైదరాబాద్ : తెలంగాణ‌లో హాట్‌హాట్‌గా సాగుతున్న మునుగోడు ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ పార్టీ మరింత‌గా స‌త్తువ కూడ‌దీసుకుని మ‌రీ బ‌రిలోకి దిగిపోతోంది. ఈ మేర‌కు మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు 38 మంది నేత‌ల‌ను స్టార్ క్యాంపెయినర్లుగా నియ‌మించిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. 38 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఈ జాబితాలో పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, టీ సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, రోహిత్ చౌద‌రి, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చ‌ల్లా వంశీచంద్ రెడ్డి, వి. హనుమంతరావు, జానా రెడ్డి, ష‌బ్బీర్ అలీ, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, రాంరెడ్డి దామోద‌ర్ రెడ్డి, మ‌ధు యాష్కీ గౌడ్‌, దామోద‌ర రాజ‌న‌ర్సింహ‌, దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్‌, జీవ‌న్ రెడ్డి, రేణుకా చౌద‌రి, బ‌ల‌రామ్ నాయ‌క్‌, కొండా సురేఖ, సీత‌క్క‌, గీతారెడ్డి, అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, సంప‌త్ కుమార్‌, శంక‌ర్ నాయ‌క్ త‌దిత‌రులున్నారు. జాబితాలో ఇంకా చాలా మంది నేత‌లున్నా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జ‌గ్గారెడ్డి పేరు క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అదే జిల్లాకు చెందిన మ‌ల్లు ర‌వి పేరు కూడా జాబితాలో క‌నిపించ‌లేదు.