భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గారు ఆరు రోజుల పాటు మలేషియా సింగపూర్ ల లో పర్యటించనున్నారు.
శనివారం జరగబోయే మలయాపురంబులో తెలుగు మధురిమలు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఈరోజు మలేషియా విచ్చేసారు. ఈ కార్యక్రమం మలేషియా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈరోజు మలేషియా విచ్చేసిన వెంకయ్యనాయుడు గారికి మలేషియా లో భారత హైకమీషనర్ B.N రెడ్డి గారు ప్రత్యేక మధ్యన భోజనం ఏర్పాటు చేశారు. ఇందులో సీనియర్ ప్రభుత్వ అధికారులు, భారతీయ మరియు తెలుగు ప్రవాసులకు చెందిన ప్రముఖ సభ్యులు హాజరయ్యారు. ఆ తరువాత రావాంగ్ లోని తెలుగు సాంస్కృతిక నిలయం, మలేషియా తెలుగు అకాడెమి ని సందర్శించనున్నారు.