Sports

భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన

భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శన

ఆసియా కప్‌ ఆసాంతం రాణించిన భారత మహిళల జట్టు.. ఫైనల్లోనూ చెలరేగింది. ప్రత్యర్థి శ్రీలంకను చిత్తుచేసి సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. చివరి పోరులో తిరుగులేని పై చేయి సాధించి చిరస్మరణీయ విజయం అందుకుంది. మొదట బౌలింగ్‌తో ప్రత్యర్థిని 65 పరుగులకే చుట్టేసిన అమ్మాయిల జట్టు.. ఆపై బ్యాటింగ్‌తోనూ విరుచుకుపడింది. లక్ష్యాన్ని కేవలం 8.3 ఓవర్లలోనే ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో భారత జట్టు ఆసియా కప్‌ను ఏడోసారి సొంతం చేసుకుంది.