మిషిగన్ ప్రవాసుడు కీ.శే. కాట్రగడ్డ సుధాకర్ స్మారత వాలీబాల్-త్రోబాల్ పోటీలు నోవైలో SPARC Arenaలో తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తానా తదుపరి అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్, ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్‌లు సమన్వయపరిచారు. 37 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మిషిగన్ అటార్నీ జనరల్ డేనా నెసేల్ ముఖ్య అతిథిగా హాజరయి ట్రోఫీలు అందజేశారు. నిస్వార్థ సేవా దృక్పథానికి, స్నేహశీలతకు, మంచితనానికి మారుపేరుగా సుధాకర్ కాట్రగడ్డ గుర్తుండిపోతారని సభికులు పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా అందిన విరాళాలు తానా అన్నపూర్ణ ప్రాజెక్టు( ప్రభుత్వ హాస్పిటల్ లలో ఉచిత నిత్య అన్నదాన కార్యక్రమం) కోసం వినియోగించనున్నారు. డాక్టర్ హనుమయ్య బండ్ల, శశాంక్ యార్లగడ్డ, శ్రీనివాస గోగినేని తదితరులు పాల్గొన్నారు.
కాట్రగడ్డ సుధాకర్ స్మారక వాలీబాల్ పోటీలు
Related tags :