కనీస సౌకర్యాలు సైతం కరువయిన రాష్ట్రం ఏదైన ఉందంటె అది అంధ్రప్రదేశ్ అనే దుస్ధితికు రాష్ట్ర పరిస్ధితి చేరుకోందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు గొల్లపల్లి సూర్యరావు విమర్శించారు. కనీస వసతుల కల్పనలో విఫలం కావడానికి తోడుగా కూల్చివేత చర్యలతో కొనసాగుతున్న విధ్వంసకర పాలన తుది దశకు చేరుకొందని ఆయన పెర్కోన్నారు. ఆదివారం దుబాయిలో తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఏ ఒక్క నిర్మాణత్మక కార్యక్రమం గానీ కట్టడం గానీ చేపట్టలేకపోయిందనె విషయాన్ని తెలుసుకోవాలని కోరారు. తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలలో అభిమానం, సానుభూతి ఉందని దీన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి విదేశాలలోని కార్యకర్తలు సైతం కృషి చేయాలని సూర్యరావు విజ్ఞప్తి చేసారు. చంద్రబాబునాయుడును మళ్ళి ముఖ్యమంత్రి చేసే వరకు ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలని సూర్య రావు పిలుపునిచ్చారు.
పేదలకు మెరుగైన ఆరోగ్య సేవలందించాలనె ఎన్టీఆర్ పిలుపు మెరకు విదేశాలలోని ఉద్యోగాలు వదులుకోని అనేక మంది ఎన్నారై డాక్టర్లు మాతృదేశానికి వచ్చారని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా చెబుతూ నిమ్స్ ను కార్పోరేటు ఆసుపత్రుల కంటె మెరుగ్గా తీర్చిదిద్దిన కాకర్ల సుబ్బారావు ఈ కోవకు చెందుతారన్నారు. వైద్య విద్యాబోధనలో కూడ ప్రవాసీయుల సూచన మెరకు ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటిను స్ధాపించారని, ఆ రకమైన నేపథ్యం ఉన్న యూనివర్సిటి పేరును జగన్ మార్చారని రాధాకృష్ణా మండిపడ్డారు. ఆరోగ్య శ్రీ పేర ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీరం చేసి కార్పోరేటు ఆసుపత్రుల లాభాలను పెంచిన వైయస్సార్ పేరు ఉండాలా లేదా ప్రభుత్వపరంగా మండల స్ధాయిలో పి.హెచ్.సి ల నుండి స్పెషాల్టీ ఆసుపత్రుల వరకు కృషి చేసిన ఎన్టీఆర్ పేరు ఉండాలా అనేది అలోచించాలని ఆయన అన్నారు. ప్రతి ప్రవాసీ తనవంతుగా మాతృదేశంలోని తమ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఓట్లను తెలుగుదేశంకు వేసేలా ఒప్పించాలని ఆయన కోరారు. సమావేశంలో దుబాయి శాఖ నాయకులు విశ్వేశ్వరరావు, ఖాదర్ బాషా, వాసురెడ్డి, నిరంజన్, రవికిరణ్, హరి,జాఫర్ అలీ, దుర్గ ప్రసాద్, బాబ్జీ, శ్రీనివాస్, షబ్బీర్ బాషా తదితరులు పాల్గోన్నారు.