Delhi : ఎర్ర గంగిరెడ్డి (Erra Gangireddy)కి సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. నవంబర్ 14 లోగా సీబీఐ (CBI) పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది.వైయస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ఎం. ఆర్. షా, ఎం.ఎం. సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. సీబీఐ విచారణాధికారులనే గంగిరెడ్డి బెదిరిస్తున్నారన్న సీబీఐ వాదనను సుప్రీం ధర్మాసనం సీరియస్‌గా తీసుకుంది. సాక్ష్యులను కూడా ప్రభావితం చేస్తున్నారని సీబీఐ తెలిపింది. ఎర్ర గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని వెల్లడించింది. సాక్షులను రక్షించుకోవాలంటే ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తప్పక రద్దు చేయాల్సిందేనని సీబీఐ వాదించింది. తదుపరి విచారణను నవంబర్ 14కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.