.మునిగేటోని …. గోడు…
..ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇలాంటి ఎన్నికను ఏనాడు చూడలే ఎవ్వడు నిమ్మలంగా ఉండనిస్తలేడు. ఒకడు మందంటాడు, ఒకడు కూర అంటాడు, ఇంకొకడు వచ్చి పైసలు అంటాడు. ఎవడి దగ్గర నిలబడ్డ ఇంకొకడికి అనుమానం. తెల్లారి ఇంకొకడు వచ్చి కలుస్తాడు. వాడు పట్టుకునే జెండా ఒకటి, చెప్పే ముచ్చట మరొకటి ఏందిరా ఇది అంటే నాయకులు అప్డేట్ అయ్యారు మనం కూడా మారాలి పెద్దయ్య అంటాడు…వాడికి రాత్రి లేదు, పగలు లేదు. సరిగా నిద్ర కూడా పోనిస్తాలేరు. ఎంత కని తాగుతాం, ఎంతకని తింటాం. తినకపోయినా తాగకపోయినా వాడితోని బదనాం. ఈ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నాం. ఆరోగ్యం పాడైతదని ఇంట్లోల్ల లొల్లి. పనికి పోదామా అక్కడ వచ్చే ఆదాయం కన్నా ఇక్కడ నాలుగు దిక్కుల జెండాలు పట్టుకుంటే ఎక్కువనే వస్తుంది. ఈఘోస పగోడికి కూడా రావద్దు. “పండుగ తెల్లారి ఎండగ అన్నట్టు” ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుక అంతా ఇగ్గినట్టు అవుతుంది, శరీరంలో సత్తువ సన్నగిల్లుతుంది. అప్పుడు పోసేటోడు ఎవ్వడు ఉండడు. నా మీద నాకే నమ్మకం పోయింది నేను ఎవరికి ఓటేస్తానో నాకే తెలియకుండా ఉన్నది. ఓటు నన్ను హీనంగా చూస్తున్నది. నిరంతరం ప్రశ్నిస్తున్నది. దీనికి నేను బాధ్యున్ని కాదు మొర్రో అంటే వినడం లేదు. నాకు తెలిసి దీనికి బాధ్యత వహించవలసింది రాజకీయ పార్టీలు నాయకులే..!? దూర ప్రాంతాల ఉన్న చుట్టాలు కూడా మునుగోడులో ధూమ్ ధామ్ దావతులు ఉన్నాయ్ అంట కదా అని ఓ తీరుగా అంటున్నారు. ఎన్నికల సంఘమా నీవే రక్షించాలి.. నిజమే కదా. ఇది నేటి రాజకీయ ప్రక్రియ.
మునుగోడు ఉప ఎన్నికల కోసం తీసుకొస్తున్న బిజేపికి చెందిన కోటి రూపాయలు పట్టివేత.
మునుగోడు మండలం చల్మెడ చెక్ పోస్ట్ వద్ద పోలీసుల వాహన తనిఖీలు.
బిజేపికి చెందిన నేత వాహనం నుంచి కోటి రూపాయలు స్వాధీనం
కరీంనగర్ జిల్లాకు చెందిన బిజేపి కౌన్సిలర్ భర్త వాహనంగా గుర్తింపు.
డబ్బుపై పూర్తి స్థాయిలో విచారిస్తున్న పోలీసులు.