ScienceAndTech

2025 నాటికి భారీగా పెరగనున్న సైబర్ నేరాలు

2025 నాటికి భారీగా పెరగనున్న సైబర్ నేరాలు

Cybercrime:ఢిల్లీలో ఇంటర్‌పోల్‌ వార్షిక సమావేశాలు ప్రారంభం

ఇంటర్‌పోల్‌ 90వ వార్షిక సమావేశాలు న్యూదిల్లీలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న ఈ సమావేశాలను ప్రధాని నరేంద్రమోదీప్రారంభించారు.ఆయనతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కూడా ఉన్నారు. ఈ వార్షిక సమావేశాల్లో 195 దేశాల నుంచి ఇంటర్‌పోల్‌ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో మంత్రులు, పోలీస్‌ చీఫ్‌లు, ఆయా దేశాల సెంట్రల్‌ బ్యూరో సభ్యులు, సీనియర్‌ పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్‌ కూడా ఇద్దరు సభ్యులను ఈ సమావేశాలకు పంపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా ఈ సమావేశానికి పాక్‌ ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. 1997లో కూడా ఒకసారి భారత్‌లో ఇంటర్‌పోల్‌ సమావేశం జరిగింది..

2025 నాటికి భారీ పెరగనున్న సైబర్‌ నేరాలు: ఇంటర్‌పోల్‌ చీఫ్‌..

సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌లో పిల్లలపై అఘాయిత్యాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇంటర్‌పోల్‌ చీఫ్‌ జుర్గెన్‌ స్టాక్‌ పేర్కొన్నారు. ఇటువంటి నేరాలు చాలా వరకు ఫిర్యాదుల వరకు వెళ్లడంలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి సైబర్‌ నేరాల విలువ 10.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుకొంటుందని చెప్పారు. న్యూదిల్లీలో ఇంటర్‌పోల్‌ 90వ వార్షిక సమావేశానికి ముందు జురెన్‌ స్టాక్‌ విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు వేల కోట్లు సంపాదిస్తున్నాయని స్టాక్‌ వెల్లడించారు. వీటిల్లో కేవలం 1శాతం మాత్రమే పట్టుకోవడంగానీ, స్వాధీనం చేసుకోవడంగానీ జరుగుతోందని చెప్పారు. ఇంటర్‌పోల్‌ గ్లోబల్‌ స్టాప్‌ పేమెంట్‌ వ్యస్థను, యాంటీ మనీ లాండరింగ్‌ ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ ప్రొటోకాల్‌ అభివృద్ధి చేసిందన్నారు. గత 10 నెలల్లోనే నేరగాళ్ల నుంచి 60 మిలియన్‌ డాలర్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.