శుక్రవారం రాత్రి మిషిగన్ లో తానా ఆధ్వర్యంలో లేడీస్ నైట్ నిర్వహించారు. ప్రవాస మహిళలు ఆటపాటలతో, విందు వినోదాలతో, ఉల్లాసంగా పాల్గొన్నారు. తానా తదుపరి అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు, ఫౌండేషన్ ట్రస్టీ పుట్టగుంట సురేష్, మను గొందిలు సమన్వయపరిచారు. తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల చైర్మన్ హనుమయ్య బండ్ల, ఉమ కటికి, పెద్దిబోయిన జోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉదయభాను వ్యాఖ్యాత్రిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిన 80వేల డాలర్లు తానా అన్నపూర్ణ ప్రాజెక్టుకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు. రాణి అల్లూరి వందన సమర్పణ చేశారు.
మిషిగన్‌లో తానా లేడీస్ నైట్. 80వేల డాలర్ల విరాళాలు సేకరణ.
Related tags :