విజిలెన్స్, బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారులమని చెప్పి బెదిరించి కంకర చిప్స్ లారీల వద్ద నుండి భారీగా నగదు వసూలు చేస్తున్న ముఠా.
ఏలూరు జిల్లా
ఈ ముఠా నూజివీడు పట్టణంలో మైలవరం వైపు నుండి వచ్చే క్రషర్ కంకర చిప్స్ లోడ్ లారీలను ఆపి బెదిరించి వారి వద్ద నుండి నగదు వసూళ్లు చేసిన వైనం.
నూజివీడు ముసునూరు తిరువూరు ప్రాంతాలలో ముఠా భారీగా నగదు వసూళ్లు.
బెదిరించి నగదు వసూలు చేస్తున్న విజయవాడ రామవరప్పాడుకు చెందిన మోదలవలస పోలయ్య అనే వ్యక్తి లారీ యజమానులకు చిక్కాడు.
పోలయ్య గతంలో మైనింగ్ విజిలెన్స్ అధికారుల వద్ద డ్రైవర్గా పనిచేసిన అనుభవంతో తెగించినట్లు తెలుస్తోంది.
విజయవాడ పరిసరాలలో సైతం వసూళ్లకు తెగించి రోజు కనీసం లక్ష రూపాయలు వసూళ్లు చేస్తున్నారు.
పోలయ్య మరికొందరతో ముఠాగా జట్టు కట్టి వసూళ్లకు తెగించాడు. పోలయ్య వసూళ్లలో కేవలం 10 శాతం పొందే వ్యక్తి అని, అసలు ముఠా నాయకుల వివరాలు తెలియడం లేదని లారీ యజమానులు అంటున్నారు.
కిరాయిలు లేక లారీలు తిప్ప లేక, తీసుకున్న ఫైనాన్స్ వాయిదాలు చెల్లించలేక అవస్థలు పడుతుంటే, అధికారుల వేధింపులు మరోపక్క తిప్పలు పెడుతోంది.
ఇప్పుడు కొత్తగా నకిలీ అధికారులు అంటూ ముఠాలు వసూళ్లకు తెగబడుతుంటే ఇక లారీలు వదిలిపెట్టి ఆత్మహత్యలు శరణ్యం అంటున్న లారీ యజమానుల ఆవేదన.
ఈ సంఘటనపై పోలీసులు దృష్టి సారించి నగదు వసూలు చేస్తున్న వారి వెనుక ఉన్న అసలు ముఠా గుట్టు రట్టు చేయాలని కోరుతున్నారు.
బ్రేకింగ్ :
ఎన్టీఆర్ జిల్లా :
పండగపూట తునికిపాడులో తీవ్ర విషాదం.. రెండు బైకులు ఢీ- ముగ్గురు మృతి..
గంపలగూడెం మండలం తునికిపాడు గ్రామ శివారు తెలంగాణ బోర్డర్ వద్ద రెండు బైకులు ఎదురెదురుగా ఢీ- కున్న వైనం..
ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకులు కొమ్మినేని శ్రీకాంత్ (35) వర్షిత్ (5)
మరో బైకుపై ప్రయాణిస్తున్న గజ్జల మురళీృష్ణ కుమార్తె నాగలక్ష్మి (8) మృతి.., మరో ముగ్గురికి తీవ్రగాయాలు,అందులో ఇద్దరు పరిస్థితి విషమం..
మృతి చెందిన వారంతా తునికిపాడు గ్రామానికి చెందినవారే..
సంఘటన స్థలానికి చేరుకున్న గంపలగూడెం ఎస్సై సతీష్..
ఇటీవలి ఉమ్మడి కృష్ణాజిల్లా లోని ఒక నియోజకవర్గంలో మీడియా ముసుగుతో దొంగల ముఠా హల్చల్
ప్రెస్ మీట్ పెడితే డబ్బులివ్వాలి
అన్ని చానళ్ళలో,పత్రికల్లో వార్త వేయిస్తాం
5వేలు నుండి 30వేల దాకా వసూళ్ళు
ఎక్కడ షాపు/హోటల్/కార్యాలయం ఓపెన్ అయినా,ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలన్నా వాలిపోతున్న మీడియా ముసుగు వేసుకున్న బందిపోటు దొంగల ముఠా
ఆహ్వానం వున్నా లేకపోయినా కారు లో ప్రత్యక్షం,అందరికీ ఇవ్వాలంటూ నిర్వాహకులను దబాయించి డబ్బు వసూళ్ళు
తాము పని చేసే పత్రిక/చానల్ లో వార్త ఏమో గానీ సోషల్ మీడియా లో పేట్రేగిపోతూ సంస్ధ ని అడ్డం పెట్టుకుని వసూళ్ళ దందా
భాగోతం బయట పడడంతో ఇటీవల ఒకరికి 5వేలు తిరిగి కట్టిన వైనం
ఇటీవల ఒక సంఘానికి చెందిన నేత ఆ ముఠాకు డబ్బులిచ్చి మోసపోయానని గ్రహించి నిలదీయడంతో డబ్బు వెనక్కి ఇచ్చేస్తానంటూ కాళ్ళ బేరం
పాత్రికేయ వృత్తి ని అడ్డం పెట్టుకుని పాడు పనులకు శ్రీకారం
మైలవరం ప్రజానీకానికి విన్నపం,మీ సమస్య,మీ ఆవిష్కరణ,మీ స్పందన,మీ వివరణ,మీ అభిప్రాయం ఇలా ఏదైనా మీరు పత్రిక/చానల్ కి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు
డబ్బులిచ్చి మీరు దిగజారొద్దు… పాత్రికేయ వృత్తిని దిగజార్చొద్దు
త్వరలో మరిన్ని వివరాలు…
టోల్ ప్లాజా సిబ్బందిపై లా స్టూడెంట్స్ దాడి
తిరుపతి జిల్లా వడమాల పేట మండలం SV పురం టోల్ ప్లాజా వద్ద ఘర్షణ తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ టోల్గేట్ సిబ్బందిపై దాడి.
పుత్తూరు ప్రైవేట్ కళాశాలలో లా చదువుతున్న తమిళనాడు విద్యార్థులు తిరుపతిలో గత కొద్దిరోజులుగా పరీక్షల రాస్తున్నారు.
ఈరోజు పరీక్షలు చివరి రోజు కావడంతో తిరుపతి నుంచి తిరుగు ప్రయాణంలో వడమాల పేట s v పురం టోల్ ప్లాజా వద్ద లా చదువుతున్న విద్యార్థి యొక్క కారు టోల్ రుసుము చెల్లింపులో టోల్ యాజమాన్నం సిబ్బందితో గొడవ దిగారు.
రుసుము చెల్లించడానికి ఆ వాహనానికి ఉన్న ఫాస్ట్ ట్యాగ్ లో డబ్బులు లేనందున టోల్ సిబ్బంది వాహనాన్ని వెనక్కి తీసి మిగిలిన వారికి దారి వదలమని చెప్పడంతో మాట మాట పెరిగి తమిళనాడు విద్యార్థులు మొదటగా సిబ్బందిపై హెల్మెట్ తో దాడి చేశారు రుసుము చెల్లింపు జరగకపోవడం గొడవకు ప్రధాన కారణం గా చెప్పుకోవచ్చు.
ఘటనా స్థలానికి చేరుకున్న వడమాల పేట ఎస్ఐ రామాంజనేయులు లా విద్యార్థులతో ముఖాముఖిగా జరిగిన సంఘటనపై కంప్లైంట్ ఇవ్వమని పబ్లిక్ వాహనాలకు ఇబ్బంది కలగకుండా పక్కకు రమ్మని చెప్పినప్పటికీ లా విద్యార్థులు మొండిగా వ్యవహరించడం మే కాకుండా టోల్ ప్లాజా ప్రదేశంలోనే జరగాలని జరగాలని కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేంతవరకు వాగ్వాదంతో గొడవ పెద్దదయింది.
టోల్ ప్లాజా ప్రదేశానికి చేరుకున్న స్థానికుల పై దాడికి దిగారు లా విద్యార్థులు అనంతరం స్థానికులు కూడా తిరగబడి వారిపై దాడి చేయడంతో పోలీసులుకు తగినంత సంఖ్యాబలం లేనందున నియంత్రించలేకపోయారు.
లా విద్యార్థులు ప్రాంతీయ భావాన్ని పదేపదే వ్యక్తపరుస్తూ టోల్గేట్ లైన్లో తమిళనాడు వాహనాలకు దారి వదులుతూ ఏపీకి సంబంధించిన వాహనాలను నిర్బంధిస్తూ ధర్నాకు దిగారు లా విద్యార్థులు.
సదరు ఘటనపై పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటామని వనమాలపేట ఎస్సై రామాంజనేయులు తెలిపారు.
విజయవాడ
బెజవాడలో విషాదం
టపాసుల దుకాణంలో చెలరేగిన మంటలు
ఇద్దరు సజీవ దహనం
జింఖానా మైదానంలో జరిగిన అగ్ని ప్రమాదం
మొత్తం 19 షాపులకు అనుమతి
అగ్నికి ఆహుతైన మూడు షాపులు
15, 16, 17 షాపుల్లో చెలరేగిన మంటలు
ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్న పోలీసులు
మృత్తులు 15వ షాపుకు చెందినవారీగా భావిస్తున్న పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే ఒక వ్యాపారికి గుండె పోటు రావటంతో ఆసుపత్రికి తరలింపు
విజయవాడ
కాంతి రానా, బెజవాడ సీపీ:-
ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు
ఘటనపై కేసు నమోదు చేసాం
ఫైర్ నిబంధనలు పాటించిన వారికే అనుమతులు ఇచ్చాం
ఉదయం టపాకాయలు దిగుమతి చేస్తుండగా ప్రమాదం
విజయవాడ
అగ్ని ప్రమాదంలో మృతులు గుర్తింపు
బెజవాడకు చెందిన కాశీ, పిడుగురాళ్లకు చెందిన సాంబగా గుర్తింపు
టపాసుల దుకాణంలో పనిచేస్తూ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు