టీటీడీ ముద్రణాలయంలో ఘనంగా ఆయుధపూజ
తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ఎదురుగా గల టీటీడీ ముద్రణాలయంలో శనివారం ఆయుధపూజ ఘనంగా జరిగింది. ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ సందర్భంగా శ్రీవారి విగ్రహానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ముద్రణాలయాన్ని అందంగా అలంకరించి అర్చకులు వేదమంత్రాలు పఠిస్తూ యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ గల డిటిపి, ఆఫ్‌సెట్, మిషన్ సెక్షన్, ఆర్టిస్టు, బైండింగ్ విభాగాల్లోని యంత్రాలకు పూజ చేశారు.
రేపు ఉదయం 10 గంటల వరకు మాత్రమే అవకాశం.
తిరుమల లో ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో సుప్రభాత సేవ, అర్చన సేవ, తోమాల సేవ.,నిజ పాద పద్మారాధనము సేవల డిశంబరు నెల రిజిస్ట్రేషన్‌లు మొదలైనవి. కావల్సిన భక్తులు ఆన్లైన్లో TTD వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్‌లు చేసుకోగలరు.
తిరుమలలో రికార్డులు తిరగరాసిన శ్రీవారి హుండీ ఆదాయం
తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు దీపావళి ఆస్ధానాన్ని టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహిస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఆదివారం 23-10-2022 రోజున 80,565 మంది స్వామి వారి దర్శించుకున్నారు. 31,608 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, రికార్డు స్థాయిలో 6.31 కోట్ల రూపాయలు భక్తులు హుండీ స్వామి వారికి కానుకలుగా సమర్పించారు. ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోయి టిబిసి వరకూ బయట క్యూలైన్స్ లో వేచి ఉన్నారు భక్తులు. దీంతో స్వామి వారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.