NRI-NRT

వెల్ డన్ శశాంక్ యార్లగడ్డ

వెల్ డన్ శశాంక్  యార్లగడ్డ

‘తానా’ యువతేజం శశాంక్ యార్లగడ్డ గత జనవరి 5, 6 తేదీల్లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జట్లతో వికలాంగుల క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఇంకో మెట్టు పైకెక్కి దక్షిణ భారత దేశ స్థాయిలో దివ్యాంగుల వీల్ ఛైర్ క్రికెట్ టోర్నమెంట్ కి శ్రీకారం చుట్టారీ తానా క్రీడా కార్యదర్శి శశాంక్ యార్లగడ్డ. ‘డిఫరెంట్లీ ఏబుల్డ్ వీల్ ఛైర్ సౌత్ ఇండియా క్రికెట్ కప్’ పేరుతో విశాఖపట్నంలో డిసెంబర్ 10 నుంచి 13 వరకు ఆంధ్రప్రదేశ్ వీల్ ఛైర్ అండ్ డిజేబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో 4 రోజులపాటు ఈ మెగా టోర్నమెంట్ నిర్వహించనున్నారు. గీతం (GITAM) యూనివర్సిటీ క్రికెట్ స్టేడియం ఈ టోర్నమెంట్ కి వేదిక కానుంది.

016