వాట్సాప్ త్వరలో ఐదు కొత్త ఫీచర్లను లాంచ్ చేయనుంది. అవి అందుబాటులోకి వస్తే ఇకపై పంపిన మెసేజ్లను నిర్ణీత టైంలోగా ఎడిట్ చేసుకోవచ్చు. వాట్సాప్ గ్రూపులో సభ్యుల సంఖ్య 1024కు పెరుగుతుంది. ఎవరికైనా డాక్యుమెంట్లు పంపేటప్పుడు క్యాప్షన్లు జత చేయవచ్చు. వాట్సాప్ మెసేజ్లు, ఫొటోలను ఎవరూ స్క్రీన్ షాట్ తీయడానికి వీలుండదు. అలాగే బిజినెస్ వాట్సాప్ అకౌంట్లకు ప్రీమియం సబ్స్క్రిప్షన్ను కూడా ప్రారంభించనుంది.