వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (SRDP) కింద తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన మరో ఫ్లై ఓవర్ ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఎల్బీ నగర్ – సికింద్రాబాద్ ల మధ్య ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు నాగోల్ వద్ద రూ. 143.58 కోట్లతో నిర్మించిన 990 మీటర్ల పొడవు గల ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ను రేపు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.