చికాగో లో దీపావళి సంబరాలు TTA ఆధ్వర్యంలో:
చికాగోలోని ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ అక్టోబర్ 22న దసరా , దీపావళి కార్యక్రమాలను స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు శ్రీ హేమచంద్ర వీరపల్లి ఆధ్వర్యంలో వైభవోపేతంగా జరుపుకుంది.
చిరంజీవులు ఆదర్శ ఆకుల, వరుణ్ వాసిరెడ్డి, తనుష్ సింగ్ ల భక్తి గీతం తో ప్రారంభమైన వేడుకలు దాదాపు 500లకు పైగా వచ్చిన సభ్యుల నడుమ నవరసభరితం గా సాగాయి. అన్ని వయస్సుల వారు పాల్గొని, తెలుగు సంస్కృతి ని ప్రతిఫలించే సంగీత , నాట్య కార్యక్రమాలతో పాటు, చిత్ర గీత నృత్యాలనూ ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. శ్రీమతి శోభా తమన్న, శ్రీమతి జానకి అయ్యర్, శ్రీమతి సౌమ్య కుమరన్, శ్రీమతి శిల్పా బజ్జూరిలు తమ విద్యార్థినీ, విద్యార్థుల బృందాలతో సమర్పించిన శాస్త్రీయ నృత్యాలు ప్రేక్షకులను సమ్మోహితులను చేస్తే, శ్రీమతి కిరణ్ చౌహాన్, శ్రీమతి బిందు పతక్ కథక్ నృత్య రీతిని, తమ బృందాలతో ప్రదర్శింప చేసి ప్రేక్షకులను అలరించారు. భక్తి గీత నృత్యాలను శ్రీమతి రమ్య తిన్నియం, శ్రీమతి షీలాలు తమ విద్యార్థినులతో ప్రదర్శింప చేసి ప్రేక్షకులను భక్తిపారవశ్యంలో ముంచారు. శ్రీమతి భవ్య బెహతా, శ్రీమతి అనురాధ శివరాం, శ్రీమతి రంజిత రాయ్ చౌదరిలు తమ విద్యార్థినీ, విద్యార్థులతో చక్కటి శాస్త్రీయ గీతాలను వీనులవిందుగా సమర్పించారు. శ్రీమతి పూజ జోషి, శ్రీమతి నీతు, శ్రీమతి ప్రియా సెంథిల్, శ్రీమతి శిల్పా శరబుల బృందాలు చేసిన చలనచిత్ర గీత నృత్యాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి.
శ్రీమతి స్వప్న పూల సహకారంతో, శ్రీమతి రేఖా వేమూరి, శ్రీమతి ప్రణతి కలిగొట్ల ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా నడిపించారు. శ్రీ హేమంత్ పప్పు సహకారంతో శ్రీమతి సోమలత ఎనమందల, సుష్మిత గన్ రెడ్డి, మిథున్ ఎనమందల లు చేసిన వేదిక అలంకరణ ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి శ్రీ జగదీశ్ కానూరి, శ్రీమతి శ్రీ గురుస్వామి, శ్రీ రామకృష్ణ కొర్రపోలు,శ్రీ శ్రీనాథ్ వాసిరెడ్డి, శ్రీ దిలీప్ రాయలపూడి, శ్రీ వీరాస్వామి అచంట, శ్రీమతి అపర్ణ అయ్యలరాజు, శ్రీమతి చాందిని దువ్వూరి, శ్రీ రవి వేమూరి, శ్రీమతి అర్చన మిట్ట, శ్రీమతి శిల్ప మచ్చ, శ్రీ భాను సిరమ్, శ్రీగుప్తా నాగుబండి, శ్రీమతి ప్రశాంతి తాడేపల్లి, శ్రీ రామకృష్ణ తాడేపల్లి, శ్రీ సందీప్ గడ్డం, శ్రీ సతీష్ మచ్చ ఎంతో తోడ్పడ్డారు.
అమెరికా హౌస్ ఆఫ్ కాంగ్రెస్లో సభ్యులైన శ్రీ బిల్ ఫాస్టర్ , శ్రీ రాజా కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి విచ్చేసారు. ఈ కార్యక్రమానికి TANAసభ్యులు, ATAసభ్యులు, CAAఅధ్యక్షులు కూడా విచ్చేసారు. చివరిలో నవరుచులతో సంస్థ ఏర్పరిచిన వచ్చిన దీపావళి విందు అందరినీ సంతృప్తి పరచింది.