మైలవరం
తండ్రి కొడుకులు రైలు కింద పడి ఆత్మహత్య
ఎన్టీఆర్ జిల్లా మైలవరం కు చెందిన తన్నీరు రామారావు 30సం.. కుమారుడు నందు 7 సం.రాలు తెలంగాణ రాష్ట్రంలోని ఏర్రుపాలెం మండల పరిధిలోని రేమిడిచర్ల మొదటి గేటు వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు
మృతుడు రామారావు మైలవరం లోని నెంబర్:5 రేషన్ షాపు డీలర్ గా పనిచేస్తున్నాడని,ఏడాది క్రితం అనారోగ్యంతో కుమార్తె 4సం..రాలు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలియజేశారు
ఇరువురు మైనర్ బాలికల మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించిన ఘంటసాల ఎస్ఐ లక్ష్మీ నరసింహ మూర్తి
కృష్ణా జిల్లా నుంచి కడప జిల్లా – 12 గంటల్లో బాలికల గుర్తింపు
:- పండుగ రోజు ప్రజా సేవలో ఘంటసాల పోలీసులు
:- కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు, అభినందించిన అధికారులు
🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐🙏🏻💐
ఘంటసాల :-
ఇరువురు మైనర్ బాలికలు మిస్సింగ్ కేసును 24 గంటల్లో చేధించిన ఘంటసాల ఎస్ఐ లక్ష్మీ నరసింహ మూర్తి ఆ బాలికలను సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించి శభాష్ పోలీసులు
అనిపించుకున్నారు.
ఘంటసాల ఎస్ఐ ఎన్.లక్ష్మీ నరసింహమూర్తి మంగళవారం అందించిన వివరాల మేరకు మండల కేంద్రమైన ఘంటసాల గ్రామానికి చెందిన ఇరువురు మైనర్ బాలికలు ఆదివారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు స్నేహితులను, బందువులను ఆరా తీసిన ఎక్కడా కనిపించక పోవడంతో సోమవారం ఉదయం 9.30 గంటలకు ఘంటసాల పోలీస్ స్టేషన్కు వచ్చి తమ కుమార్తెలు కనపడటం లేదంటూ బాలికల తల్లి ఫిర్యాదు చేసింది.
శ్రీయుత కృష్ణాజిల్లా ఎస్పీ జాషువా గారి ఉత్తర్వులు మేరకు అవనిగడ్డ డిఎస్పీ మహబూబ్ బాషా ఆదేశాలతో, చల్లపల్లి సిఐ బీబీ రవికుమార్ ఉత్తర్వులు మేరకు కేసు నమోదు చేసిన ఎస్ఐ లక్ష్మీ నరసింహమూర్తి కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని తన సిబ్బందితో నాలుగు బృందాలుగా రంగంలోకి దిగి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తప్పిపోయిన బాలికలు వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్నట్లు 12గంటల్లో గుర్తించారు. 24గంటల్లో బాలికలను ఘంటసాల స్టేషన్కు తీసుకొచ్చి మంగళవారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఫిర్యాదు చేసి 24 గంటలు గడవక ముందే తమ కుమార్తెలను తమకు అప్పగించిన ఎస్ఐ లక్ష్మి నరసింహ మూర్తికి, సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేయగా, ఎస్పీ జాషువా, డిఎస్పీ మహబూబ్ బాషా, సీఐ బీబీ రవి కుమార్, ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలంతా దీపావళి పండుగలో ఉంటే పోలీసులు మాత్రం ప్రజాసేవలో ఉండి తప్పిపోయిన ఇరువురు మైనర్ బాలికలను కుటుంబ సభ్యులకు అప్పగించి వారికి నిజమైన పండుగ వాతావరణం కల్పించడం పట్ల ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘంటసాల ఎస్సై లక్ష్మీ నరసింహ మూర్తిని, పోలీసులను అభినందనలతో ముంచెత్తారు.
అరుణాచల్ ప్రదేశ్ మార్కెట్ లో అగ్నిప్రమాదం 700 దుకాణాలు దగ్ధం
Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 700 లకు పై గా దుకాణాలు కాలిబుడిదయ్యాయని పోలీసులు తెలిపారు.అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు.
ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఆరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ సమీపంలోని నహర్లాగన్ డైలీ మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 700 దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారు పేర్కొన్నారు.
మచిలీపట్నం లో విషాదం
మచిలీపట్నం
నవీన్ మిట్టల్ కాలనీ కి చెందిన వేమూరి లక్ష్మి నరసింహారావు (11) దీపావళి మందులు పెద్దల పర్యవేక్షణ లేకుండా మతాబు కలుస్తుండగా ప్రమాదం
తీవ్రగాయాల పాలైన బాలుడు
ప్రమాదంలో బైక్ కూడా దగ్ధం
మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రి కి తరలింపు ,
మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా
బాలుడు మృతి