అగ్రనేతల రాకతో వేడెక్కనున్న మునుగోడు
చండూరులో 30న సీఎం కేసీఆర్, 31న జేపీ నడ్డా సభలు
బంగారిగడ్డ వద్ద ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ
*ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ *
27, 28 తేదీల్లో భారత్ జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్ నేతలు
పల్లెల్లో పోలీసు బలగాల మోహరింపు
నల్గొండ : మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా ఏడు రోజుల సమయమే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలన్నీ వేగం పెంచాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ఇన్‌ఛార్జుల్లో పలువురు దీపావళి పండగ నిమిత్తం సొంత ప్రాంతాలకు వెళ్లారు. దీంతో రెండు రోజుల పాటు క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలు అంతంతమాత్రంగానే ప్రచారం నిర్వహించాయి. తాజాగా వారందరూ నియోజకవర్గానికి తిరిగి చేరుకోవడంతో క్షేత్రస్థాయిలో మళ్లీ సందడి మొదలైంది. చండూరు పురపాలిక పరిధిలోని బంగారిగడ్డ వద్ద ఈ నెల 30న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ప్రచారం ముగియటానికి రెండు రోజుల ముందు జరిగే ఈ సభ ద్వారా ప్రచారాన్ని పతాకస్థాయికి తీసుకెళ్తామని ఉమ్మడి నల్గొండ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు. ఆ సభ లోపు ప్రతి గ్రామంలోనూ పరిస్థితిని పార్టీకి అనుకూలంగా మలచుకోవాలని పార్టీ భావిస్తోంది. మరోవైపు ఈ నెల 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ సభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
గతంలోనూ ఆగస్టు 21న సీఎం కేసీఆర్ సభ మునుగోడులో జరగగా ఒక రోజు వ్యవధిలోనే ఆగస్టు 22న కేంద్ర హోంమంత్రి సభ బహిరంగ సభ జరగడం విశేషం. మరోవైపు భాబీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలంతా క్షేత్రస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీపావళి సందర్భంగానూ నియోజకవర్గంలోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. నడ్డా సభకు భారీ ఎత్తున జనసమీకరణ చేస్తామని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తోంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి ఈ నెల 27, 28 తేదీల్లో మునుగోడు నియోజకవర్గ ముఖ్య నేతలు, నాయకులతో పాటు పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి పాదయాత్ర చేస్తారని మాజీ మంత్రి తెలిపారు. 27న నాలుగు మండలాలు, 28న మూడు మండలాల్లోని మొత్తం 298 బూత్‌ల నుంచి ఒక్కో బూత్ పరిధి నుంచి కనీసం 100 మంది చొప్పున కార్యకర్తలు పాదయాత్రకు రావాలని నాయకులు కోరుతున్నారు. అవసరమైతే నవంబరు 1న శంషాబాద్ సమీపంలో సభ ఏర్పాటు చేసి.. మునుగోడు నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలను పెద్దఎత్తున తరలించాలని నిర్ణయించారు. సభపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, రాహుల్ యాత్రలో కార్యకర్తలు పాల్గొంటారని మాజీ మంత్రి వెల్లడించారు.
పల్లెల్లో పోలీసు బలగాల మోహరింపు : పోలింగ్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ నియోజకవర్గ వ్యాప్తంగా పలు మండలాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఓ ప్రధాన పార్టీ అభ్యర్థి ప్రచారం సందర్భంగా రెండు రోజుల క్రితం చౌటుప్పల్ మండలంలోని నాలుగు గ్రామాల్లో జరిగిన గొడవ ఇరువర్గాలు రాళ్ల దాడులు చేసుకునేంత వరకు వెళ్లింది. నారాయణపురం, మునుగోడు, నాంపల్లి మండలాల్లోని గ్రామాల్లోనూ నాలుగైదు రోజులుగా ప్రధాన పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య గొడవలు పెరిగాయి. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో గొడవలు పెరిగే అవకాశం ఉందంటూ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నిఘా వర్గాలు హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికలు ముగిసేవరకు సుమారు 40 గ్రామాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేసి కేంద్ర బలగాలతో పహారా కాయాలని నివేదిక ఇచ్చాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ఆయా గ్రామాల్లో స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. దీంతోపాటు అనుమానితులను, నేర చరిత్ర ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.
నేడు తెలంగాణకు రాహుల్ గాంధీ రాక
భారత్ జోడో యాత్ర పునఃప్రారంభం
గురువారం మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద రాష్ట్రంలో రెండోరోజు పాదయాత్ర ప్రారంభం
హైదరాబాద్ : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర రాష్ట్రంలో గురువారం పునఃప్రారంభం కానుంది. ఆదివారం రాష్ట్రంలో తొలిరోజు పాదయాత్ర ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి రాహుల్ రాష్ట్రానికి తిరిగి చేరుకుంటారు. నారాయణపేట జిల్లా టైరోడ్ వద్ద రాత్రి బస చేస్తారు. గురువారం ఉదయం 6.30 గంటలకు మక్తల్ సమీపంలోని సబ్ స్టేషన్ వద్ద రాష్ట్రంలో రెండోరోజు పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.30 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా సాగుతుంది. గురువారం రాత్రి గుడిగండ్ల గ్రామం వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి ఎనగండ్ల వద్ద బస చేస్తారు. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పాదయాత్ర జరుగుతుంది. జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రతి రోజు వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించనున్నారు. గురువారం బీడీ కార్మికులతో పాటు రైతు ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారం, అవసరమైన కార్యాచరణ సహా పలు అంశాలపై చర్చిస్తారు.
[5:49 pm, 26/10/2022] Muddu Krishna Reporter : ఐదేళ్లు పోరాటం చేయమని కత్తిస్తే మధ్యలో వదిలేసి సొంత కాంట్రాక్టుల కోసం పారిపోయి అమ్ముడుపోయిన వ్యక్తి రాజగోపాల్
తెలంగాణ అంతా అభివృద్ధి చెందితే మునుగోడు అత్యంత దుర్భరంగా ఉంది
మేళ్లచెరువు, శివన్న గూడెంను ఏనాడైనా పట్టించుకున్నాడా
ఏనాడూ మునుగోడు ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రిని కలవకుండా, అడగకుండా ఉన్న వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తున్నాడు
ప్రజల్ని సొంత బిడ్డల్లా చూసుకునే కెసిఆర్
బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి, కాన్పుకి కెసిఆర్ కిట్, చదువుకి గురుకులాలు మన అన్ని అవసరాలు తీర్చే సర్కార్ టిఆర్ఎస్
ఒక్క ఓటు కారుకు వేయండి సర్పంచ్ నుండి ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరితో మునుగోడు అభివృద్ధికై పని చేయించుకోండి
గౌడన్నల అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్న కేసీఆర్ సర్కార్
సంస్తాన్ నారాయణపురంలో గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి గంగుల కమలాకర్.
ఐదేళ్లు మునుగోడు ప్రజల హక్కుల కోసం పోరాడమని ఓటేసి కత్తిస్తే మధ్యలో వదిలేసి పారిపోయిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అని, నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి లేకపోవడం చూస్తే బాధేస్తుందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బుధవారం స్థానికంగా జరిగిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో సహచర మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిలతో కలిసి పాల్గొని మాట్లాడారు. మునుగోడును ఏనాడు పట్టించుకోని రాజగోపాల్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం 18 వేల కాంట్రాక్టుల కోసం ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ గద్దలకు గులామ్ చేసి వంచించాడని, మునుగోడు జీవ ప్రధాయిని అయిన మేళ్లచెరువును, శివన్న గూడెం గాలికొదిలేసి అవినీతి రాజకీయాలు చేస్తున్న బిజెపి అభ్యర్థి మనకు అవసరమా అని ప్రశ్నించారు. మళ్లీ సువర్ణ ఆకాశంలా వచ్చిన ఈ ఎన్నికల్ని ఉపయోగించుకోవాలని ప్రతీ ఒక్క ఓటు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారికి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ మొదలు ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్య మంత్రి వరకు మన సమస్యల్ని చెప్పుకొని పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏనాడూ ప్రజా సమస్యలపై మాట్లాడకుండా మునుగోడు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవకుండా సొంత రాజకీయాలు, కాంట్రాక్టులు చేసిన వ్యక్తి మళ్లీ గెలిచినా అదే చేస్తాడని దుయ్యబట్టారు మంత్రి గంగుల.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎక్కడ ఏ బిజెపి రాష్ట్ర ప్రభుత్వంలోనూ లేనివిధంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేస్తుందని గతంలో బిడ్డ పెళ్లి కోసం పుట్టింటికి వెళ్ళి సొంత అన్నను అడిగిన సాయం చేయలేదని కానీ కెసిఆర్ గారు ఎవరు అడగకుండానే బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి ఇచ్చి ఆదుకున్నారని తొలుచూరు కాన్పుకు సైతం కేసీఆర్ కిట్‌ని అందించడమే కాకుండా వెనుకబడిన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వెయ్యికి పైగా గురుకులాలతో ప్రపంచ స్థాయి విద్యను అందిస్తున్నారని ఇలా సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా పాలన సాగిస్తున్న కేసీఆర్ సర్కార్‌కు మనమందరం అండగా ఉండాలన్నారు. కడుపునిండా తిన్న తర్వాత దివేనార్థులు ఇచ్చే తెలంగాణ నైజాన్ని మనందరం గుర్తుంచుకోవాలని, ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని సంస్థాన్ నారాయణపురం తో పాటు మునుగోడు సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల కమలాకర్.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, స్థానిక జడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేశం గౌడ్, ఎంపీపీ ఉమా ప్రేమ్‌చంద్రారెడ్డి, గౌడ సంఘం నాయకులు పాలకొల్లు యాదయ్య గౌడ్, గంగాపురం శ్రీరాములు గౌడ్, నీళ్ల నరసింహాగౌడ్, నీళ్ల గాలయ్య గౌడ్, మోగుదాల సత్తయ్య గౌడ్, పందుల యాదగిరి గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో గౌడ సంఘం మహిళలు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు.
[5:49 pm, 26/10/2022] Muddu Krishna Reporter : చండూర్ ప్రచారంలో సీపీఐ, సీపీఎం నాయకులతో మంత్రి ఎర్రబెల్లి భేటీ
రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ది పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులతో చెప్పిన మంత్రి
మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చుండూరు మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా సిపిఐ, సిపిఎం నాయకులు కూడా ప్రచారం చేస్తూ ఎదురవగా వారితో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో అక్కడ జరుగుతున్న ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రజల స్పందన ఎలా వుందని వారితో ఆరా తీశారు. ఈ సందర్భంగా తెరాసా పార్టీ చేస్తున్న అభివృద్ది పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని వారికి సూచించారు. అలాగే బీజేపీ పార్టీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ది చెప్పాలని ప్రజలకు చెప్పాలన్నారు.
హైదరాబాద్
మన్నగూడలో యాదవ – కురమల సభలో మంత్రి హరీశ్ రావు కామెంట్స్
ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమలు
ఆనాడు న్యాయం ధర్మం పాండవుల వైపు ఉండి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టారు.
కేసీఆర్ ఏ సీఎం గతంలో చేయని రీతిలో మన గొల్ల కురుమల కోసం ఆత్మగౌరవం నిలబెట్టారు. ఆర్థికంగా నిలబెట్టారు. పరిపాలన లో నిలబెట్టారు.
ఐ.ఎఎస్. ఐపీఎస్ కన్నా గొప్ప తెలివితేటలు ఉన్న వారు గొల్ల కురమలని అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్పారు.
ఎన్సీడీ వాళ్లు అప్పు కింద ఇచ్చారు తప్ప గతంలో నలుగురు ముఖ్యమంత్రులు ..చంద్రబాబు నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్సీడీపై సంతకం పెట్టలేదు. కాని కేసీఆర్ గారు 75 సబ్సిడీతో గొర్రెపిల్లలు ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్.
ప్రభుత్వంలో ,చట్ట సభల్లో, రాజ్య సభలో ఇలా గొప్పగా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించారు.
కేసీఆర్ గారు ఇంత చేసినప్పుడు.మనం కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా నిలబడాలి.
75 శాతంతో రాయితీతో గొర్రెలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ గారిని బలపర్చాలి.
కర్ణాటకలో అప్పటి మంత్రి రేవణ్ణ ఈ గొర్రెల స్కీం చూసి ఆశ్చర్యపోయారు. నేను కాంగ్రెస్ లోఉన్నా..కేసీఆర్ ను కలవాలని భావిస్తున్న అని.. కర్ణాటక నుండి హైదరాబాద్ కు వచ్చి గొంగడి కప్పి, గొర్రెపిల్లను ఇచ్చి సన్మానించిన వ్యక్తి. ఆయనకు కాంగ్రెస్ ఇందుకు గాను నోటీసులు ఇచ్చిండ్రు. కాని కేసీఆర్ దేశంలో ఎవరూ చేయని రీతిలో గొల్ల కురమలకు చేశారని దైర్యంగా చెప్పారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ నేతలకు కనపడం లేదు. కాని పక్క రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ నేతలకు కనబడుతోంది.
కురమలది, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మాణం జరుగుతున్నయి. రెండు మూడు నెలల్లో ప్రారంభం కానున్నాయి.
బీజేపీ వాళ్లు కాంగ్రెస్ వాళ్లు చాలా మాట్లాడుతున్నరు. బీసీ మంత్రిత్వ శాఖ పెట్టమంటే, ఇవాళ్టి వరకు బీసీ శాఖ పెట్టలేదు.
రైతు బంధు, రైతు బీమా, రైతుకు ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు.
మన రాష్ట్రంలోని ప్రతిపక్షాలు ఎలా ఉన్నయంటే. హుజురాబాద్ లో దళితబంధు పథకం కేసీఆర్ గారు పెడితే ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు కాగానే డబ్బులు పోతయని దుష్ప్రచారం చేశారు. కాని 24 వేల కుటుంబాలకు దళిత బంధు అమలు అయింది.
ఇవాళ మన అక్కౌంట్లలో గొల్ల కురుమలు గొర్రెలు కొనుక్కోవాలని డబ్బులు వేయించారు. ఇవి రావని, సీజ్ అవుతయని జూటా మాటలు చెపుతున్నరు. రేపు ఐదో తేదీ తర్వాత ఎప్పటి లాగా మీకు నచ్చిన చోట గొర్రెలు కొనుక్కునేలా అవకాశం కల్పిస్తరు.
ఇంత బాగా పథకాలు వచ్చినయి. కాంగ్రెస్ ఉన్ననాడు కాలిపోయే మోటర్లు..పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు. దొంగ రాత్రి కరెంటు బాధలు.
ఇవాళ రైతులకు ఉచిత కరెంటుతో పాటు, రైతు బంధు, రైతు బీమా తెచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
బీజీపే చేసిందేంటి. సిలండర్ ధర 400 రూపాయల నుండి 1200 చేసిండ్రు.
బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెడతమంటున్నరు.
ఆర్థిక మంత్రిగా ఉన్న. మాకు ఉత్తరం పంపిండ్రు. మీరు బాయిల కాడ, బోర్ల కాడ మీటర్లు పెడితే ఏడాదికి ఆరు వేల కోట్లు ఇస్తం. ఇలా ఐదేళ్లకు 30 వేల కోట్ల ఇస్తమన్నరు.
కాని కేసీఆర్ గారు ప్రాణం పోయినా మీటర్లు పెట్టేది లేదని చెప్పారు.
మేం ధర పెంచి 400 అక్కౌంట్లో వేస్తమని సిలిండర్ విషయంలోచెప్పారు. తర్వాత అది 40 రూపాయలకు వచ్చింది.
రేపు బిల్లు పంపుతరు..ముక్కు పిండి విద్యుత్ బిల్లులు వసూలు చేస్తరు.
కొద్ది మంది జూటామాటలు, పూటకోమాట మాట్లాడే వారు వస్తున్నరు. అట్టి బట్టెబాజ్ గాళ్లకు , జూటేబాజ్ గాళ్లకు మీరే బుద్ది చెప్పాలి.
ఈ పోరాటంల మీరు ధర్మాన్ని నిలబెట్టండి.
కొమరెల్లి మల్లన్నకు గతంలో కాంగ్రెస్,టీడీపీలు యాదవులను ఛైర్మన్ గా చేయమంటే చేయలే. గొల్ల కురమల్ని సంపత్ ను ఛైర్మన్ గా చేసిండ్రు…కేసీఆర్ గారు.
ఆ గుడిని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.
ఇలా గొల్ల కురమలను అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం.
టీఆర్ఎస్ కు మద్ధతు ఇచ్చి బలపర్చండి.
మంత్రి ఎర్రబెల్లిని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ ఎంపీ రాపోలు
రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ గారిని కలిసిన మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ ఈరోజు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని మంత్రులు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు మాట్లాడుకున్నారు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ సొంత గ్రామం కొడకండ్ల పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉంది. ఇరువురు గతంలోనూ మంచి మిత్రులు.