ఉత్తరాఖండ్‌లోని ప్రఖ్యాత కేదార్‌నాథ్ ఆలయం స్వర్ణశోభితమైంది. 550 బంగారు రేకులతో ఆలయ గర్భగుడిలోని గోడలు, పైకప్పును ముస్తాబు చేశారు. మూడు రోజులుగా జరుగుతున్న ఈ అలంకరణ పనులు బుధవారం ఉదయం పూర్తయ్యాయని శ్రీ బద్రీనాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్ తెలిపారు. పురావస్తు శాఖకు చెందిన ఇద్దరు అధికారుల సమక్షంలో 19 మంది కళాకారులు ఈ పని పూర్తి చేశారు. రూర్కీలోని ఐఐటీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్, పురావస్తు శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ గర్భగుడిని బుధవారం పరిశీలించింది.
కేదార్‌నాధుడి బంగారు శోభ
Related tags :