Fashion

రాయచోటిలో శిల్పారామం ఏర్పాటుకు స్థలం కేటాయింపు

రాయచోటిలో శిల్పారామం ఏర్పాటుకు  స్థలం కేటాయింపు

రాయచోటి లో శిల్పారామం ఏర్పాటు కోసం 13 ఎకారాల స్థలం కేటాయింపు….

అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి లో పర్యాటక శాఖ అధ్వర్యంలో నూతన శిల్పారామం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెల్పింది…
రాష్ట్ర ప్రభుత్వ విధానమైన వికేంద్రీకరణ తోనే అభివృద్ధి సాద్యం అనే మాటను నిజం చేస్తూ కేవలము నగరాలకు మాత్రమే పరిమితమైన శిల్పారామం ఇపుడు మన రాయచోటి పట్టణం లో ఏర్పాటు కాబోతుంది… ఇందులో హస్త కళా కారుల కోసం సంవత్సరం పొడవునా వారి ఉత్పత్తులు ప్రదర్శన మరియు అమ్మకం కోసం స్టాల్స్ నిర్మించి ఉచితం గా కేటాయించి వారి కి జీవనోపాధి కల్పించటం , శాస్త్రీయ మరియు జానపద కళాకారులు ప్రదర్శనల కు అవకాశాలు కల్పించటం తో పాటు, కళారూపాలు పరిరక్షించడం మరియు ప్రజలకు ఆహ్లాదకర పచ్చని వాతావరణం లో ఉద్యానవనం ఏర్పాటు చేసి కుటుంబ సమేతం గా వచ్చి సేదతీరే లా ఏర్పాటు చేస్తూనే పిల్లలు ఆట విడుపు కోసం కూడా ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు….

శిల్పారామం ఏర్పాటు కోసం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గ పర్యటక శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత భార్గవ్ IAS గారు, జిల్లా కలెక్టర్ PS. గిరిషా గ , మరియు నూతన జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారిగా శిల్పారామం సంస్థ కి స్థలం కేటాయించిన రెవెన్యూ శాఖ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ IAS చొరవ వలన శిల్పారామం రాయచోటి లో ఏర్పాటు కు మార్గం సుగమం అయ్యింది…

ఈ సందర్భంగా రాష్ట్ర శిల్పారామం సీఈఓ శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత భార్గవ్ IAS వారి ఆదేశాల మేరకు మరియు పర్యటక శాఖ ఎండీ కన్నబాబు IAS సహకారంతో అలాగే శిల్పారామం ఏర్పాటు కు చొరవ తీసుకున్న వారి అందరకీ ధన్యవాదాలు తెలియచేస్తూ, తొందర్లోనే పనులు ప్రారంభించి
త్వరతిగతిని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. అంతేకాకుండా ప్రత్యక్షం గా 100 మందికి పరోక్షంగా మరో 200 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని తెలియచేశారు….

ఈ కార్యక్రమంలో శిల్పారామం CEO శ్యామ్ సుందర్ రెడ్డి, SE బలరామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు…