ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో మునుగోడులో మారిన ప్రచార సరళి
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడులో ప్రచార సరళి మారింది. పరస్పరం పోటాపోటీ ఆందోళనలతో తెరాస, బీజేపీ నేతలు హోరెత్తించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశంతో కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోందంటూ మునుగోడు వ్యాప్తంగా తెరాస నిరసనలకు దిగింది. పోటీపడలేక అసత్య ఆరోపణలతో బురద చల్లుతోందని కమలం నేతలు ప్రతిగా ఆందోళనలు చేపట్టారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు
అరెస్ట్‌ను రిజక్ట్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన సైబరాబాద్ పోలీసులు
ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరిన పోలీసులు
మెజిస్ట్రేట్ తప్పుడు ప్రొసీజర్‌ను అనుసరించారని అభియోగం
ఇవాళ మధ్యాహ్నం హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ
ఎమ్మెల్యే ల కొనుగోలు వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించిన సైబరాబాద్ పోలీసులు.
కొనుగోలు పాత్రదారులంటూ నిన్న ముగ్గురిని ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
సరైన ఆదారాలు లేవన్న కోర్ట్ నిందితుల రిమాండ్ ను నిరాకరించిన కోర్ట్.
ఏసీబీ కోర్ట్ నిర్ణయంపై హైకోర్ట్ కు వెళ్లిన పోలీసులు
అమ్ముడు పోయేందుకు సిద్దమై ఫామ్ హౌస్ కి వచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు.
అక్కడ పరిస్థితి చూసి తీవ్ర ఆందోళన..
పోలీసులను చూసి షాక్…!
ప్రగతి భవన్ లో వారికీ సినిమా చూపించిన పెద్ద సార్…
పార్టీలు మారాలన్న ఆలోచన లో ఉన్న కొందరు ఇతర ఎమ్మెల్యేలకు దడ పుట్టించిన కెసిఆర్..!
బీజేపీ నేతల తొందరపాటు ప్రకటనలు… షిండే తరహా ఆపరేషన్ అంటూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ చేసిన మెసేజ్ తో పూర్తిగా అప్రమత్తమైన కెసిఆర్…
Mla కొనుగోలు వ్యవహారం లో audio రిలీజ్ ఫంక్షన్ స్టార్టెడ్
లక్ష కంటే తగ్గొద్దు
86 మంది ఇన్‌చార్జులు.. ఒక్కొక్కరికి వెయ్యి మంది టార్గెట్
సభ జరిగే ప్రదేశం సమీపగ్రామాల్లో నుంచి 10 వేల మంది
స్వచ్ఛందంగా వచ్చే కార్యకర్తలతో సంఖ్య లక్ష మించిపోవాలి
కేసీఆర్ సభకు జనం తరలింపుపై మంత్రి కేటీఆర్ సూచన
30న మునుగోడులో సీఎం బహిరంగ సభ
హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గంలోని బంగారుగడ్డ గ్రామంలో ఆదివారం సీఎం కేసీఆర్ బహిరంగ సభకు లక్ష మందిని తరలించాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ టార్గెట్ పెట్టారు. ఉప ఎన్నిక ప్రచారం కోసం ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక్కొక్కరు చొప్పున 86 మంది ఇన్‌చార్జులను నియమించిన సంగతి తెలిసిందే. వారితో కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇన్‌చార్జి కనీసం వెయ్యి మందిని తప్పనిసరిగా సభకు తరలించాలని టార్గెట్ పెట్టారు. సభ నిర్వహించే ప్రదేశం నుంచి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల నుంచి 10 వేల మందికి తగ్గకుండా జనాలను తరలించాలని సూచించారు. సభకు ఉమ్మడి నల్లగొండ నుంచి పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా తరలివస్తే లక్ష మందికి తగ్గకుండా సభ విజయవంతం అవుతుందని వివరించారు. యువకులు, మహిళల తరలింపుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. ఉపఎన్నికలో టీఆర్‌ఎ్‌సతో కలిసి నడస్తున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలను, క్యాడర్‌ను, వివిధ సంఘాలను సమన్వయం చేసుకోవాలని కేటీఆర్ సూచించారు.
సీఎం హెలికాప్టర్‌లో వస్తారు
సమాయాభావం వల్ల కేసీఆర్ బంగారు గడ్డకు హెలికాప్టర్‌లో వస్తారని, నిర్ణీత సమయానికి ప్రజలు సభాస్థలిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. మునుగోడు నియోజకవర్గంలోని దండు మల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేశామని, రాబోయే రోజుల్లో 30వేల నుంచి 40 వేల మంది యువకులకు ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ తెలిపారు. సర్వేలన్నీ టీఆర్‌ఎ్‌సకు అనుకూలంగా ఉన్నాయని, మనమే గెలుస్తామని కేటీఆర్ అన్నారు. ఈ వారం రోజులు చాలా కీలకమని, ఇన్‌చార్జులు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
గడీల రాజ్యాన్ని బద్ధలు కొట్టాలి
రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
చౌటుప్పల్ : కేసీఆర్ గడీల రాజ్యాన్ని బద్ధలు కొట్టి గరిబోళ్ల రాజ్యాన్ని తీసుకురావాలంటే మునుగోడులో బీజేపీని గెలిపించాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన మునుగోడు నియోజకవర్గస్థాయి గౌడల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ పాలనలో బడుగు బలహీనవర్గాలకు ప్రాధాన్యం కరువైందన్నారు. బీసీల గురించి ప్రశ్నిస్తే సీఎం కేసీఆర్ వారిపై అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కులాలు, వృత్తుల పేరుతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం కోట్లు దండుకునేందుకు జిమ్మిక్కులు చేస్తోందన్నారు. బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్నకు చరిత్రపుటల్లో స్థానం కల్పించడంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. పోరాట యోధుల చరిత్రను, వారి త్యాగాలను టీఆర్‌ఎస్ విస్మరించిందని విమర్శించారు. ప్రజావిశ్వాసాన్ని కోల్పోయి న టీఆర్‌ఎ్‌సకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ గారడీ మాటల ను ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్నారు. హుజూరాబాద్‌లో దళితబంధు ఇచ్చినా, మద్యం ఏరులై పారించినా కేసీఆర్ దుర్మార్గపు పాలన వద్దని ప్రజలు తనను గెలిపించారన్నా రు. మునుగోడులో సైతం రాజగోపాల్‌రెడ్డిని ప్రజలు అదేరీతిలో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రం తొలి స్థానంలో ఉందని, మద్యం కారణం గా వేలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని విమర్శించారు. హుజూరాబాద్ ఫలితాన్నే మునుగోడులో పునరావృతం చేసి సీఎం కేసీఆర్ చెంప చెళ్లుమనిపించాలన్నారు.
మునుగోడు అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యం
విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి
నల్లగొండ జిల్లా నాంపల్లిలో టీఆర్‌ఎస్ పార్టీలో పలువురి చేరిక
దేవరకొండ : మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతోనే సాధ్యమని విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మం డలం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకు లు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ
మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను విఫరీతంగా పెంచుతుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం వచ్చే బీజేపీ నేతలను గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు పెంచారో నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలు అభివృద్ధి చెందాయని, మునుగోడు నియోజకవర్గంలో ప్లోరైడ్ సమస్యను మిషన్‌భగీరథ ద్వారా పరిష్కరించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, నాంపల్లి మండల రైతుబంధు అధ్యక్షుడు ఏడుదొడ్ల రవీందర్‌రెడ్డి, నాయకులు రమేష్, నగేష్, అంజయ్య, మామిడి వెంకటయ్య పాల్గొన్నారు.
కుటిల రాజకీయాలు మానుకోవాలి : వినోద్‌కుమార్
సంస్థాన్ నారాయణపురం : కుటిల రాజకీయాలను బీజేపీ మానుకోవాలని అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సంస్థాన్‌నారాయణపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఘటన గురించి బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి టీఆర్‌ఎస్ నాయకులపై, కేసీఆర్‌పై నిందలు మోపుతున్నారని, ఇది సమంజసం కాదన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని బీజేపీ ముఠా ప్రయత్నించిందని, అడ్డంగా దొరికిపోవడంతో బుకాయిస్తూ ఇదంతా డ్రామా అంటూ ఆ పార్టీ నేతలు కొత్త పల్లవిని ఎత్తుకున్నారని విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తదితరులు చెప్పినట్టుగానే మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఎరవేసేందుకు బేరసారాలు జరిగాయన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన బీజేపీ నాయకులే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. పాల వంటి స్వచ్ఛమైన ప్రజాస్వామ్యంపై బీజేపీ విషం చిమ్ముతోందని, విషనాగుల కుంపటి, విష సంస్కృతికి ఆ పార్టీ నిలువుటద్దమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ అపహాస్యం చేస్తోందని, ప్రజాతీర్పును నోట్ల కట్టలతో తుంగలో తొక్కేస్తుందన్నారు. కుట్రలు, కుతంత్రాలు బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని, అడ్డదారిన అధికార పీఠాన్ని అధిష్టించడమే వారి కుటిల నీతి అన్నారు. 2014నుంచి అరుణాచల్‌ప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా, సిక్కిం, పుదుచ్చేరి, మహారాష్ట్రలలో ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ప్రభుత్వాలను కూలగొట్టి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఆయా ప్రభుత్వాలను బీజేపీ కూల్చడం కూడా డ్రామానేనా అని ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను ముందే పసిగట్టిన బీహార్, రాజస్థాన్ రాష్ర్టాల్లో ఆయా ముఖ్యమంత్రులు అప్రమత్తం కావడంతో వారి ఆటలు సాగలేదన్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో ఉండకూడదన్నదే ఆ పార్టీ నినాదమని, బీజేపీ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో సర్పంచ్ సికిలమెట్ల శ్రీహరి, సింగిల్‌విండో చైర్మన్ జంగారెడ్డి, గుత్తా ప్రేమ్‌చందర్‌రెడ్డి, అంజయ్య పాల్గొన్నారు.
పైసలు దొరికితే చూపించాలి : అందులో ఉన్నవి పైసలా…బాంబులా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
నల్గొండ : మునుగోడు ఉప ఎన్నికల చార్జ్‌షీట్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులు వివరించడానికే చార్జ్‌షీట్ విడుదల చేసినట్లు తెలిపారు. స్వార్థపు ఆలోచనలతో మునుగోడు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో ఏం చేస్తారో కేసీఆర్ చెప్పడం లేదని, ఏం చేస్తామో తాము చెప్పామని అన్నారు. అభ్యర్థిని వెంటబెట్టుకుని తిరిగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కమెడియన్లకంటే దిగజారాడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మీడియాకు ఇబ్బందులు జరిగితే మొదట స్పందించేది బీజేపీనే అని, వాస్తవ పరిస్థితులు చూపించాలని ఆయన సూచించారు. ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని, అలాగే సీపీ, నలుగురు ఎమ్మెల్యేల కాల్ లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త ఆడియోలు తయారు చేస్తున్నారు అవి ముఖ్యమంత్రికి ఇంకా అందలేదట అంటూ యెద్దేవా చేశారు. ఫామ్‌హౌజ్ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తామని, చట్టాన్ని నమ్ముతామని, వదిలేది లేదు సీబీఐ విచారణ జరగాలని పట్టుబట్టారు. పైసలు దొరికితే చూపించాలని, అందులో ఉన్నవి పైసలా, బాంబులా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమీషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ వెల్లడించారు