**ప్రజా వేదిక ధ్వంసంతో ఆరంభమైన జగన్ రెడ్డి జెసిబి పాలన ప్రతిపక్ష నేతల ఆస్తుల్ని లక్ష్యం చేసుకుంది. ఇప్పుడు ప్రభుత్వ అరాచకాలని ప్రశ్నించే ప్రజల్ని బలిగొంటోంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పొడుగుపాలెం గ్రామంలో ఎల్లమ్మ అనే వృద్ధురాలిని జెసిబితో తొక్కించి చంపడం వైసిపి రాక్షస పాలనకు పరాకాష్ట. వైసీపీ నేతల ఆదేశాలతో కొంతమంది అధికారులు సుపారీ గ్యాంగుల్లా తయారయ్యారు.. వృద్ధురాలిని చంపిన అధికారులని, దీని వెనుక ఉన్న వైసిపి నేతల్ని తక్షణమే అరెస్టు చేయాలి. ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న నిరుపేదలకు
పట్టాలివ్వాలి.
…నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి**
**అనంతపురం:
గుత్తి ఆర్ టి సి బస్టాండ్ లో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది..
ఆర్ టి సి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో స్లాబ్ పెచ్చులూడి ప్రయాణికుల తలలపై పడ్డాయి..
ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలు..
మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రానికి తరలించారు..
ఇప్పటికైన అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు..**
**గుంటూరు జిల్లా, తెనాలి నిత్యం పూజలు చేసుకునే దేవత విగ్రహాలను తొలగించడం పట్ల బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి పద్మ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో ఉన్న విఘ్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి , తదితర దేవత విగ్రహాలను పూజించుకోవడం జరుగుతుంది అని తెలిపారు గురువారం సాయంత్రం ఉన్న విగ్రహాలు శుక్రవారం ఉదయం సమయానికి లేకపోవడం తమకు ఎంతో ఆవేదన కలిగించదున్నారు. అక్రమ కట్టడాలను కూ ల్చకుండా అడ్డుగా లేని దేవత విగ్రహాలు తొలగించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు .తొలగించిన విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అక్రమంగా కట్టిన కట్టడాలని తొలగించాలని ఆమె పేర్కొన్నారు.**
**తాడేపల్లి:
వడ్డేశ్వరంలో పెళ్ళి వేడుకల్లో యువకుల మధ్య ఘర్షణ
జోజి అనే యువకుడికి కత్తి పోట్లు
పెళ్లి ఊరెగింపులో డాన్స్ వేసే క్రమంలో యువకుల మధ్య మొదలైన వివాదం
మద్యం మత్తులో జోజీ పై కత్తితో పొడిచిన సిసింద్రీ, మరో యువకుడు
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు జోజి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు**
**విజయవాడ నగరపాలక సంస్థ
ది. 28-10-2022.
నగరంలో జరిగినటువంటివి ఆధునికకరణ పనుల పరిశీలించిన,
పనుల్లో నాణ్యాత లేకుంటే బిల్లులు చెల్లించం, –
కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్.
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పలు గ్రీనరి ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ విభాగం మరియు ఉద్యానవన విభాగం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించినారు. అభివృద్ధి పనులల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పూర్తిస్థాయిలో పరిశిలించి మాత్రమే గుత్తేదార్లకు బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు.
కనకదుర్గ ఫ్లై ఓవర్, క్రింద డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుండి భవానిపురం, స్వాతి జంక్షన్ లోపల వరకు కాంట్రాక్టర్లకు వారు పూర్తి చేసినటువంటి గ్రీనరీ వర్క్స్ కి చెల్లించాల్సి బిల్లులకు సంబదించి కమిషనర్ గారు జరిగినటువంటి పనులను క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలసి పరిశీలించినారు.
పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
పబ్లిక్ రిలేషన్ అధికారి i/c.**
**జింఖానా గ్రౌండ్స్ నందు దీపావళి మందుగుండు సామాను పేలుడు ఘటన కేసు నందు
ముద్దాయిల అరెస్ట్
ది.23.10.2022 న విజయవాడలోని జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన బాణా సంచ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించి బాణాసంచా పేలడంతో ఇద్దరు మృతి చెందటంతో బాటు 15, 16, 17వ నంబర్ దుకాణాలు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ సంఘటన పై సత్యనారాయణపురం పోలీసు స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 586/2022 U/S 285, 304 PART-II, SEC. 3 & 5 OF EXPLOSIVES SUBSTANCES ACT 1908 AND SECTION 9 (B) (1) (A) (B) OF EXPLOSIVES ACT 1884 కేసు నమోదు చేయటం జరిగింది. గౌరవనీయులైన శ్రీ క్రాంతి రానా టాటా IPC, కమీషనర్ ఆఫ్ పోలీస్, విజయవాడ వారి ఆదేశాలమేరకు, శ్రీ కొల్లి శ్రీనివాస రావు, ADCP టాస్క్ ఫోర్సు, I/C DCP West Zone అద్వర్యంలో, దర్యాప్తు అధికారి అయిన శ్రీ రమణ మూర్తి, ACP టాస్క్ ఫోర్సు, I/C North Division దర్యాప్తు కొనసాగించినారు. కేసు వివరములు:
వై.గోపాల కృష్ణ మూర్తి బీసెంట్ రోడ్డులో గతంలో బట్టల వ్యాపారం చేసేవాడు, ఈ సంవత్సరం అతను జింఖానా గ్రౌండ్ లో షాప్ నెంబర్:16 నందు అతను మరియు అతని స్నేహితుడు అయిన గోవిందరాజు మందుగుండు సామాను వ్యాపారం చేయుటకు నిశ్చయించుకొని గోపాల కృష్ణ కొంత లైసెన్సుడు సామాను కొనుగోలు చేసి మరియు తాడేపల్లిగూడెంకు చెందిన చిరతపూడి కిషోర్ కుమార్ మరియు రామాంజనేయులు వద్ద నుండి దేశీయ తయారీ అయిన 10,000 చిచ్చుబుడ్లు (100 బ్యాగ్స్), 40 బ్యాగ్స్ మతాబులు (ఒక్కొక్క బ్యాగ్ 25 kgs) కొనుగోలు చేసి వాటిని TATA ACE లో ది 22.10.2022 తేదీ సాయంత్రం సరుకును షాప్ నందు దించినారు. వీటితో పాటు తన భాగస్వామి అయిన గోవిందరాజు యొక్క పాత మందుగుండు సామగ్రిని మరియు 4 బస్తాల ఉల్లిపాయల బాంబులు (అన్ లైసెన్సేడ్) లను షాప్ లో ఫ్రేమ్ ల వెనుక నందు ఉంచినారు. వీరి వద్ద పనిచేయుటకు నాంచారయ్య, రాధాకృష్ణ, సాంబయ్య, ఉమామహేశ్వర రావు, బ్రహ్మమ్మయ్య మరియు కాశయ్య లను నియమించుకున్నారు. ది. 23.10.2022 తేదీ ఉదయం 06.30 గంటల సమయమున బ్రహ్మయ్య, కాశయ్య లు షాప్ లో వెనుక భాగంలో సామాను సర్దుతుండగా మరియు గోపాలకృష్ణ, గోవిందరాజు ముందుభాగంలో ఫ్రేమ్ ల మీద సామాను సర్దుతుండగా రాధాకృష్ణ, సాంబయ్య మరియు ఉమామహేశ్వర రావు షాప్ నకు బయట వైపు రేకులకు బోల్ట్ లను బిగిస్తున్నారు. ఆ సమయంలో నా0చరయ్య బయట వున్నా సామాను లోపలికి అందజేయుచున్నాడు. కాశయ్య, బ్రహ్మయ్య లోపల సర్దుతున్న సుమారు 07.30 గంటల సమయమున ఉల్లిపాయ బాంబులు గల బస్తా క్రిందపడి వత్తిడికి పెద్ద శబ్దంతో పేలి మంటలు రాగా ప్రక్కనే బస్తాలలో ఉన్న చిచ్చుబుడ్లు, మతాబులు అంటుకొని అవి కూడా పేలి మంటలు చెలరేగినవి. గోపాలకృష్ణ, గోవిందరాజు, నాంచారయ్య, రాధాకృష్ణ, సాంబయ్య, ఉమామహేశ్వర రావు మరియు ఫైర్ సిబ్బంది బకెట్స్ తో నీరు పోసి మంటలు ఆర్పుటకు ఫైర్ ప్రయత్నించిన మంటలు అదుపు కాలేదు. తరువాత ఫైర్ ఇంజిన్ ద్వారా మంటలను అర్పినారు. ఈ ప్రమదంలో బ్రహ్మయ్య, కాశయ్య ప్రాణమును కోల్పోయినరు. ఇతరుల ప్రాణాలకు నష్టం మరియు ఆస్థి నష్టం జరుగుతుంది అని తెలిసి కూడా పరిమితికి మించి అధిక మొత్తంలో మందుగుండు సామగ్రిని నిల్వ వుంచి ప్రమాదమునకు కారణమైన గోపాలకృష్ణ, గోవిందరాజు అదేవిదంగా పరిమితికి మించి సప్లయ్ చేసిన కిశోర్ మరియు రామాంజనేయు లను దర్యాప్తు అధికారి అయిన శ్రీ రమణ మూర్తి, ACP టాస్క్ ఫోర్సు. I/C North Division, సత్యనారాయణపురం సిబ్బంది సహకారంతో ది.27.10.2022 తేదీన అరెస్ట్ చేసినారు.**