కర్ణాటక సీఎం ప్రత్యేక ఆహ్వానం.. అసెంబ్లీకి వెళ్లనున్న ఎన్టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR) త్వరలో కర్ణాటక అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Basavaraj Bommai) ఆహ్వానం మేరకు నవంబర్ 1న అక్కడి అసెంబ్లీలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు.ఈ వేడుకల్లో భాగంగా కన్నడ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటకలో విశిష్ఠ పురస్కారంగా భావించే ‘కర్ణాటక రత్న’ అవార్డు ఇవ్వనున్నారు. ఈ అవార్డు అందుకున్న తొమ్మిదోవ వ్యక్తిగా పునీత్ పేరు సొంతం చేసుకున్నారు. తెలుగులోనే కాకుండా కర్ణాటకలోనూ ఎన్టీఆర్‌కు ఉన్న విశేష ఆదరణ, పునీత్‌తో ఆయనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తారక్‌తోపాటు రజనీకాంత్, జ్ఞానపీఠ్అవార్డు గ్రహీత చంద్రశేఖర్ కంబర్, పునీత్ రాజ్‌కుమార్ కుటుంబానికి కూడా ఆహ్వానాలు అందాయి.