ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) 2022 దీపావళి వేడుకలు శుక్రవారం నాడు అలెన్ క్రెడిట్ యూనియన్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తమన్ సంగీత విభావరి అలరించింది. శివమణి, నవీన్ కుమార్, మనీషా ఈరబతిని, పృధ్వీ చంద్ర, రమ్య బెహ్రా, శ్రీ కృష్ణ, శ్రీ సౌమ్య, శృతి రంజని, సాకేత్ కొమండూరి, హారిక నారాయణ్ ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచారు. టాంటెక్స్ సంస్థ అధ్యక్షుడు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధ్యక్షుడు వెంకట్ ములుకుట్ల, కార్యవర్గ సభ్యులు సంగీత బృందాన్ని సత్కరించారు.
“టాంటెక్స్” దీపావళిని ఉర్రూతలూగించిన తమన్
Related tags :