Devotional

TNI ఆధ్యాత్మికం.. 12 రోజుల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించటం ఎలా

TNI ఆధ్యాత్మికం.. 12 రోజుల్లో ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించటం ఎలా

🍁అతితక్కువ ఖర్చు తో సొంతంగా 12 రోజుల లో 9 జ్యోతిర్లింగాలను దర్శించుట ఎలా?🍁

ప్లాను లో వున్న రైళ్లు
ప్రతి రోజు నడిచేవి.

మీ అవసరాన్ని బట్టి మీకు కావలిసిన ఊరిలో మీరు విశ్రమించ వొచ్చు.

అభిషేకం కొరకు రాగి లేదా వెండి పాత్ర తీసుకు వెళ్ళండి.

Note: రైల్వే స్టేషన్ కోడ్ ని () లోపల వ్రాసి ఉన్నది.

🌺1వ రోజు:
బేగంపేట్ లో రాత్రి 9:00 కి ట్రైన్ # 57549 (ఔరంగాబాడ్ పాసెంజర్) ఎక్కి మరుసటి రోజు పొద్దున్న 6:30 కి పర్లీ రైల్వే స్టేషన్ లో దిగండి.

OR

మీరు విజయవాడ నుంచి యాత్ర ప్రారం భిస్తుంటే, ట్రైన్# 17206 కాకినాడ సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి లేదా ట్రైన్# 17208 విజయవాడ లో సాయి నగర్ షిర్డీ ఎక్ష్ప్రెస్స్ పొద్దున్న 10.30 కి ఎక్కి, పర్లీ (PRLI) రైల్వే స్టేషన్ లో రాత్రి 12:05 కి దిగండి (ప్రయాణ సమయము 13 గంటలు).

🌺2వ రోజు:
పర్లీ రైల్వే స్టేషన్ నుండి బైజనాథ్ గుడి 3KMs దూరం లో వుంది. స్టేషన్ బైట ఆటోలు దొరుకును.

ఉదయం
🌺బైద్యనాథ్ జ్యోతిర్లింగ[1] దర్శనం.

చేసుకున్న పిమ్మట
బస్సు లో పర్భానీ () (67KMs)
రైల్వే స్టేషన్ కి 10:30 AM లోగ చేరుకొని
ట్రైన్# 12715 స్చఖండ్ ఎక్ష్ప్రెస్స్ 10.37 AM ఎక్కండి .
లేదా
ట్రైన్# 17618
తపోవన్ ఎక్ష్ప్రెస్స్ 11.17 AM కి ఎక్కండి.
ఔరంగాబాద్ () రైల్వే స్టేషన్ లో మధ్యాహ్నం 2:30 PM కి దిగి
30 కిలోమీటర్ల దూరం లో వున్న

🌺గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగాన్ని (2)దర్శించండి.

గ్రిశ్నేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనము (ఇక్కడ నుంచి ఎల్లోరా గుహ 1KM దూరం లో వుంది, ఏ గుహలను పూర్తి గా చూడాలంటే ఒక రోజు పడ్తుంది) గుడి దెగ్గర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.

🌺3 వ రోజు:
ఔరంగాబాద్ బస్సు స్టాండు లో
నాశిక్ బస్సు ఎక్కండి.
నాశిక్ బస్టాండ్ (దూరం 187 కిలోమీటర్లు)
ప్రయాణ సమయం 5 గంటలు.
నాశిక్ బస్సు స్టాండ్ లో
త్రియంబక్ కి వెళ్లే బస్సు ఎక్కి
(దూరం 30 కిలోమీటర్లు)

🌺 త్రియంబకేశ్వర జ్యోతిర్లింగం[3] దర్శించుకోండి.

(రాత్రి 9:00 PM వరకు గుడి తెరచి ఉంటుంది) దర్శనం తరువాత, గోదావరి ఆవిర్భవించిన క్షేత్రం దర్శించండి.
గుడి దెగ్గర రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.

🌺4 వ రోజు:
పొద్దున్నే 06:00 AM బయలుదేరి నాశిక్ బస్సు స్టాండ్ చేరుకోండి.

07:00 గంటలకు నాశిక్ బస్సు స్టాండ్ లో మంచర్ వెళ్లే గవర్నమెంట్ బస్సు (ప్రైవేట్ బస్సు ఎక్కితే లేట్ అవుతుంది) ఎక్కి మంచర్ బస్సు స్టాండ్ లో 11:00 AM కి దిగండి.
(దూరం 150 KMs).

మంచర్ బస్టాండ్ లో
భీమా శంకర్ బస్సు ఎక్కి
భీమశంకర్ (61KMs, 2hours) లో

🌺భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని [4]
దర్శించుకొండి.

(బస్సు స్టాండ్ దెగ్గర లో నే గుడి వున్నది).
మధ్యాహ్నం 2:00 PM కి భీమశంకర్ బస్టాండ్ లో
పూణే బస్సు ఎక్కి పూణే (PUNE) రైల్వే స్టేషన్ కి చేరుకొండి .
(110 KMs, 3 hours).
రాత్రి 7:50PM కి ట్రైన్# 11090 పూణే భగత్ కి కోతి ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

ఒక వేళారోజు
గురువారం ఐతే డైరెక్ట్
సోమనాథ్ ట్రైన్
రాత్రి 7:50 PM ట్రైన్# 11088
పూణే వెరావల్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.

🌺5 వ రోజు:
అహ్మదాబాద్ (ADI) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:45AM కి దిగి
ట్రైన్# 11464 జబల్పూర్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 8:15AM కి
లేదా ట్రైన్#19119 అహ్మదాబాద్ సోమనాథ్ ఎక్ష్ప్రెస్స్ 10:40 AM
ఎక్కి వెరావల్ (VRL) రైల్వే స్టేషన్ లో సాయంత్రం 5:35PM కి లేదా 7:30PM కి దిగండి.

అక్కడ
బల్క తీర్థ్ దర్శించి,
ప్రభాస్ తీర్థ్ త్రివేణి సంగమం లో స్నానం చేసి

🌺సోమనాథ్ జ్యోతిర్లింగ[5]

దర్శనం చేసుకుని
ట్రైన్# 19251 సోమనాథ్ ఒక ఎక్ష్ప్రెస్స్ వెరావల్ లో రాత్రి 11:10 కి ఎక్కండి.

🌺6 వ రోజు:
ద్వారకా (DWK) రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:10 AM కి దిగి,
ద్వారకాధీశ్ దర్శనం,

🌺నాగేశ్వర జ్యోతిర్లింగ [6] దర్శనం.

చేసుకుని
ట్రైన్# 19006 (సౌరాష్ట్ర మెయిల్) మధ్యాహ్నం 1:00 PM కి
ద్వారకా స్టేషన్ లో ఎక్కండి. { (optional) లేదా
ఒక రోజు ద్వారకా లో నే ఉండి ద్వారకాధీశ్ గుడి,
ఆది శంకరాచార్య మఠం,
భేట ద్వారకా,
భద్కేశ్వర్ మహాదేవ్ గుడి,
గోపి తలాబ్,
గోమతి నది దర్శించండి.}

🌺7 వ రోజు:
వడోదర (BRC) రైల్వే స్టేషన్ లో
రాత్రి 12:48 AM కి దిగి,
ట్రైన్# 12961 అవంతిక ఎక్ష్ప్రెస్స్ రాత్రి 1:10 AM కి ఎక్కండి. లేదా వడోదర లో రూమ్ తీస్కొని రెస్ట్ తీస్కోండి.

🌺{8 వ రోజు:
వడోదర రైల్వే స్టేషన్ నుంచి
61KMs దూరం లో సముద్రం లో వున్న స్తంభేశ్వర్ మహాదేవ్ గుడికి వేళ్ళగలరు. రాత్రి
9:50 PM కి
ట్రైన్# 19309 GNC ఇండోర్ ఎక్ష్ప్రెస్స్ ఎక్కండి.}

🌺9 వ రోజు:
ఉజ్జయిని (UJN)
రైల్వే స్టేషన్ లో ప్రొద్దున్న 7:20 AM లేదా 4:00 AMకి
దిగి శిప్రా నది లో స్నానం చేసి

🌺 మహాకాళేశ్వర జ్యోతిర్లింగ[7] దర్శనం

చేసుకున్న తరువాత లోకల్ సైట్ సీఇంగ్ బస్సు ఎక్కండి.

అక్కడ వున్న అమ్మ వారి శక్తిపీఠాన్ని దర్శించు కొండి.
తరువాత ఓంకారేశ్వర (135 kms) బస్సు ఎక్కి,

🌺ఓంకారేశ్వర జ్యోతిర్లింగ[8] దర్శనం చేసుకోండి.
పక్కనే వున్న స్వామి గజానన ఆశ్రమం లో రూమ్ తీసుకోండి.

🌺10 వ రోజు:
పొద్దున్నే నర్మదా నది లో స్నానం చేసి మళ్ళి వీలయితే ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి,
ఖండ్వా (70KMs) బస్సు ఎక్కి ఖండ్వా (KNW) రైల్వే స్టేషన్ కి ప్రొద్దున్న 10:00 AM లోపల చేరుకొండి.

అక్కడ
ట్రైన్# 11093 మహానగర ఎక్ష్ప్రెస్స్ లేదా
ట్రైన్# 12167 లోకమాన్య తిలక్ టెర్మినస్
వారణాసి సూపర్ ఎక్ష్ప్రెస్స్
ప్రొద్దున్న 10:00AM కి ఎక్కండి.

🌺11 వ రోజు:
వారణాసి (కాశి) (BSB)
రైల్వే స్టేషన్ కి పొద్దున్న 3:45 AM కి చేరుకొండి.

కాశి లో గోదోలియా చౌక్ దెగ్గర రూమ్ లేదా డార్మిటరీ తీస్కొని ఫ్రెష్ అప్ ఐ

🌺కాశి విశ్వేశ్వర జ్యోతిర్లింగ[9] దర్శనం చేసుకోండి,

తరువాత కాశి విశాలాక్షి శక్తిపీఠ దర్శనం చేసుకోండి,
తరువాత తిల్ బండేశ్వర్ శివ లింగాన్ని (బెంగాలీ తొల దెగ్గర వుంది) దర్శించుకోండి .

(ఈ శివ లింగాన్ని దర్శించిన వారు కాశీ లో అన్ని శివ లింగాలు దర్శించినట్టే),

కాల భైరవుని కూడా దర్శించుకోండి. ముఖ్యమైనది
మధ్యాహ్నం 12:00 నుంచి 12:10 వరకు మణికర్ణికా ఘాట్ లో సంకల్పం చెప్పుకుని స్నానం చెయ్యాలి.

ఆ సమయం లో స్నానం చేస్తే లోకం లో వున్న సకల నదులలో స్నానం చేసిన దాని కంటే ఉత్తమం (చాగంటి కోటేశ్వర్ రావు గారి ప్రవచనం).

రామేశ్వరం లోని శివ లింగానికి అభిషేకం కొరకు వేరుగా ఒక పాత్ర లో గంగ జలం తీసుకో గలరు.

సాయంత్రం 5:00 PM కి
సికింద్రాబాద్ (SC) రైల్వే స్టేషన్ వెళ్ళుటకు
ట్రైన్# 12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్ వారణాసి
రైల్వే స్టేషన్ ఎక్కండి .
లేదా
విజయవాడ వెళ్ళుటకు
ట్రైన్# 12296 సంఘ మిత్ర ఎక్ష్ప్రెస్స్ ముఘల్ సారాయి (MGS)
రైల్వే స్టేషన్ లో రాత్రి 11:27PM కి ఎక్కండి.

మీరు ప్రయాగ లో స్నానం చేయ్యాలంటే వారణాసి నుండి ప్రయాగ (రైలు లో ప్రయాణ సమయం 3:30 గంటలు).

ముందుగా వేరే రైలు లో చేరుకొని
అలాహాబాద్ (MGS) రైల్వే స్టేషన్ (ALD)
(ప్రయాగ) లో స్నానం చేసి
రాత్రి 8:40 కి హైదరాబాద్ వెళ్లే train#12792 సికింద్రాబాద్ ఎక్ష్ప్రెస్స్
అలాహాబాద్ రైల్వే స్టేషన్ లో ఎక్కగలరు.

🌺12 వ రోజు:
సికింద్రాబాద్ కి రాత్రి 10:00 PM కి చేరుకొండి .
లేదా
విజయవాడ కి ప్రొద్దున్న 6:05 AM కి చేరుకొండి.🤘

రామ భక్తులకు సూచన
సుదూర ప్రయాణం చేసి అయోధ్య చేరుకున్న మన తెలుగు భక్తులకు ప్రతి రోజు స్వామివారి దర్శనం అయితే లభిస్తుంది, కానీ భోజన, వసతికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి సమయంలో అయోధ్యలో మన తెలుగు వారికి అన్నసమారాధన కార్యక్రమం శ్రీ సీతారామచంద్ర చారిటబుల్ ట్రస్ట్ వారు అయోధ్యలో కనక్ భవన్ సమీపంలోనే కల్పిస్తూ ఉన్నారు. మీకు ఏ రోజు అన్నసమారాధన కావాలో, ఏ రోజు మీరు భోజనం చేయదలచారో వివరాలకు 9305205903 లేదా 9550754389 నెంబర్లను సంప్రదిచగలరు.

గమనిక : ముందుగా తెలియజేసినట్లయితే వారు మీకు భోజన ఏర్పాట్లు చేయగలరు.

సూచన : భక్తుల సౌకర్యార్థం మీ whatsapp groupల ద్వారా ప్రచారం కల్పించవలసినదిగా కోరుచున్నాను.
జైశ్రీరామ్