తన తండ్రి బోనీ కపూర్ నిర్మించిన చిత్రంలో జాన్వీ కపూర్ తొలిసారిగా నటించింది. ఆ చిత్రం ‘మిల్లి’ శుక్రవారం విడుదల అయింది. ఆ సినిమా టాక్ ఎలా ఉందనే విషయాన్ని పక్కనే పెడితే, జాన్వీ గురించి ఓ కొత్త న్యూస్ ఇప్పుడు బీ టౌన్‌లో వినిపిస్తోంది. అదేమిటంటే. జాన్వీ, ఆమె కుటుంబ సభ్యులు ముంబైలోనే ఖరీదైన ప్రాంతం బాంద్రా వెస్ట్‌లో డుప్లెక్స్ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారట. ఆ ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా? అక్షరాలా రూ 65 కోట్లు . 6, 421 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ ఇది. జాన్వీ, ఆమె చెల్లెలు ఖుషీ, బోని కపూర్ కలసి ఈ ఫ్లాట్ కొన్నారట. రూ 3 కోట్ల 90 లక్షలు స్టాంప్ డ్యూటీ కట్టారట. అక్టోబర్ 12న ఈ ఫ్లాట్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు పూర్తయ్యాయి.