Business

లండన్‌లో ప్రతిష్ఠాత్మక క్లౌడ్ నేటివ్ అవార్డు గెలుచుకున్న జియో

లండన్‌లో ప్రతిష్ఠాత్మక క్లౌడ్ నేటివ్ అవార్డు గెలుచుకున్న జియో

దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) అరుదైన పురస్కారాన్ని అందుకుంది. అంతర్జాతీయ టెలికం మీడియా కంపెనీ టోటల్ టెలికం లండన్‌లో నిర్వహించిన వరల్డ్ కమ్యూనికేషన్ అవార్డ్స్ (WCA)లో క్లౌడ్ నేటివ్ అవార్డును కైవసం చేసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారిలో ఈ ఏడాది విజేతలు కూడా ఉన్నారు.