Politics

భాజపా, జనసేన పొత్తుపై స్పందించిన కిషన్ రెడ్డి

b

బీజేపీ జనసేన పొత్తుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పవన్ కల్యాణ్ (జనసేన)తో కలిసి వెళ్తున్నామని స్పష్టం చేశారు. పవన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించడం సరికాదన్నారు. దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు విచారణ జరపాలన్నారు. వాళ్లతో కాకపోతే కేంద్రం విచారణ చేస్తుందని కిషన్ రెడ్డి అన్నారు