NRI-NRT

బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం

బోస్టన్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమం

అగ్రరాజ్యం అమెరికాలోని మసాచు రాష్ట్రం బూస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ (NRI TDP) ఆధ్వర్యంలో ‘మీట్ అండ్ గ్రీట్’ (Meet and Greet) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోస్టన్ (Boston) నగరంలో ఈ ఏడాది మే నెలలో జరిగిన మహానాడు కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించినందుకు ఎన్నారై టీడీపీ నాయకులందరినీ అభినందించారు. అలాగే ఇదే స్ఫూర్తితో అమెరికాలోని పలు నగరాలలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎన్నారై టీడీపీ నాయకులకు ఆయన పిలుపునిచ్చారు.