అధికంగా మద్యం తాగే యువతకు స్ట్రోక్ ముప్పు పొంచి ఉందని దక్షిణ కొరియా అధ్యయనంలో తేలింది. సియోల్ వర్సిటీ పరిశోధకులు 15 లక్షల మందిపై అధ్యయనం నిర్వహించారు. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఏండ్లపాటు అధికంగా మద్యం సేవించేవారికి స్ట్రోక్ ముప్పు 20 శాతం ఎక్కువగా ఉంటుందని గుర్తించారు. అధిక రక్తపోటు, ధూమపానం, శరీర బరువు స్ట్రోక్ ప్రమాదాన్ని ప్రభావితం చేస్తున్నాయని కనుగొన్నారు.