*ఏటీఎం నగదు వ్యాన్‌తో డ్రైవర్ పరారీ
ఏటీఎంలో సిబ్బంది నగదు జమ చేస్తుండగా వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ నగదు, వ్యాన్‌తో ఉడాయించాడు. రైటర్ సేఫ్ గార్డ్ ఏజెన్సీకి చెందిన భాస్కర్, అశోక్ కన్సీగ్రిజ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన సెక్యూరిటీ గార్డులు . ఏటీఎంలో సిబ్బంది నగదు జమ చేస్తుండగా వ్యాన్‌లో ఉన్న డ్రైవర్ నగదు, వ్యాన్‌తో ఉడాయించాడు.
*ఏలూరు, బచ్చులవారిగూడలో టీడీపీ మాజీ సర్పంచ్ భూక్యా శ్రీను ఆత్మహత్యాయత్నం చేశాడు. నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌లోనే పురుగుల మందు తాగాడు. దీంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
*విశాఖలో పదిమంది విద్యా విద్యార్థ నీలు అదృశ్యం. క్వీన్ మేరీ హై స్కూల్ లో నలుగురు 10 క్లాసు విద్యార్థినిలు అదృశ్యం. వన్ టౌన్ పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు. నిన్న సాయంత్రం నుండి కనిపించకపోవడం తో తల్లిదండ్రులు ఆందోళన. మిసింగ్ కేసు మిస్టరీ ను ఛేదించే పనిలో పోలీసులు. ఇప్పటికే అన్ని పోలీసు గ్రూపుల్లో,వలంటరి గ్రూప్ ల్లో ఆల్ట్ చేసిన పోలీసులు.
*ఫోర్జరీ సంతకాలతో 2 సెంట్ల భూమిని అయ్యన్న ఆక్రమించారు. ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్.
మీడియా ముందుకు వచ్చిన సీఐడీ డీఐజీ సునీల్ నాయక్. అయ్యన్న, విజయ్, రాజేశ్ లపై తమకు ఫిర్యాదు అందిందని వెల్లడి.2 సెంట్ల భూమిని ఆక్రమించారని ఆరోపణ .అందుకోసం ఫోర్జరీ సంతకాలు చేయించారన్న సునీల్.ఏఈ స్థాయి అధికారితో బలవంతంగా అటెస్టేషన్ చేయించారని వివరణ.నెల రోజుల పాటు ఆరోపణలపై విచారణ చేపట్టినట్టు వెల్లడి.ఆరోపణలన్నీ వాస్తవమేనని విచారణలో తేలిందన్న డీఐజఐపీసీ 464, 467. 471. 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడి.తెల్లవారుజామున అరెస్ట్ చేశామని వివరణ,అరెస్ట్ సందర్భంగాబల ప్రయోగం జరిగిందన్న సీఐడీ ఉన్నతాధికారి.చట్ట ప్రకారమే నడుచుకున్నామన్న డీఐసీ సునీల్ నాయక్.టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు…ఆయనను కోర్టు ము…
*బి.కొత్తకోట,పిటీఎం పోలీస్ స్టేషన్ లను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు.పిటీఎం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసి స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి నేరాలను రోడ్డు ప్రమాదాలను అదుపు చేయడంలో పోలీసుల పాత్ర ముఖ్యం అంటూ పేర్కొన్న ఎస్పిఅలాగే బి.కొత్తకోటలో నీ స్టేషన్ ను తనిఖీ చేసి స్టేషన్ లోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఎస్పీ బి.కొత్తకోట పట్టణంలో ప్రధానమైన రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించిన ఎస్పీఅలాగే విజాబుల్ పోలీసింగ్ ను ఏర్పాటు చేసి ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచాలని జిల్లా ఎస్పీ బి.కొత్తకోట ఎస్సై రామ్మోహన్ ను సూచించారు
ఎస్పీ వెంట ఎస్ SB DSP రవికుమార్,DCRB సిఐ రాజేంద్రప్రసాద్, మొలకలచెరువు సీఐ సాధిక్ అలీ, బి.కొత్తకోట ఎస్సై రామ్మోహన్ పిటిఎం ఎస్ఐ మధురామ చంద్రుడు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు
* శబరి ఎక్సప్రెస్ కు పెట్టిన ఇనుపరాడ్ ఘటనలో పురోగతి..గుంటూరు కంకర గుంట రైల్వే గేట్ వద్ద శబరి ఎక్సప్రెస్ కు ట్రాక్ పై ఇనుపరాడ్ ఉంచిన ఘటనలో పురోగతి..ఇద్దరిని అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు..మరోకరి కోసం గాలింపు చేపట్టారు..మద్యం మత్తులో పెద్ద రాడ్ ని ముక్కలు చేసేందుకు ట్రాక్ పై ఇనుపరాడ్ ని నిందితులు ఉంచినట్లు విచారణలో వెల్లడి..
* అయ్యన్న అరెస్ట్‌పై ప్రెస్‌మీట్ మధ్యలోనే వెళ్లిపోయిన ఏపీ సీఐడీ డీఐజీ, మీడియా ప్రశ్నలు అడుగుతుండగానే.. సమాధానం ఇవ్వకుండానే ప్రెస్‌మీట్ నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ ఎంత స్థలం కబ్జా చేశారనేది తమకు ముఖ్యం కాదని.. ఫోర్జరీ చేశారనేదే ముఖ్యమన్న సునీల్ నిందితులు సహకరించకపోతే.. ఇంట్లోకి ఏ విధంగానైనా వెళ్లొచ్చని చట్టంలో ఉంది…సీఐడీకి ఫిర్యాదు వచ్చింది కాబట్టి అరెస్ట్ చేశామన్న సునీల్ నాయక్
*విశాఖ రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.రుషికొండపై సర్వే చేయాలని సర్వే బృందానికి హైకోర్టు ఆదేశం. సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందానికి ఆదేశం.అనుమతికి మించి ఎంతమేర తవ్వకాలు జరిపారో సర్వే చేయాలని ఆదేశం. అనుమతికి మించి ఎంతమేత భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని ఆదేశం. సర్వే నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందానికి ఆదేశం.విచారణ డిసెంబర్ 14కు వాయిదా వేసిన హైకోర్టు