DailyDose

ఓటెత్తిన మునుగోడు..రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదు

ఓటెత్తిన మునుగోడు..రికార్డు స్థాయిలో 93.13 శాతం పోలింగ్ నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని మునుగోడు ఉపఎన్నికలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. మునుపెన్నడూ లేని రీతిలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కనబరిచిన మునుగోడు మహిళలు, యువత.. తమ ఓటుహక్కును ఉత్సాహంగా వినియోగించుకున్నారు. పలు కేంద్రాల్లో రాత్రి 10.30గంటల వరకు పోలింగ్ జరిగింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 93.13 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు.