బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ తల్లిదండ్రులయ్యారు. ఆదివారం ఉదయం ఈ జంట పండంటి ఆడబిడ్డకు జన్మినిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్14న వీరిద్దరు ఘనంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళైన రెండు నెలలకే ఆలియాభట్ తన ప్రెగ్నెన్సీని వెల్లడించి అందరికి షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ప్ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పింది. కాగా అలియాభట్ ప్రెగ్నెన్సీతోనే ‘బ్రహ్మస్త్ర’ ప్రమోషన్‌లను చేసింది. ఇక రణ్‌బీర్, అలియా ఆడబిడ్డకు జన్మనివ్వడంతో కపూర్ ఇంట్లో సంబురాలు మొదలయ్యాయి. ఇక సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ఇటీవలే రణ్‌బీర్, అలియా జంటగా నటించిన ‘బ్రహ్మస్త్ర’ ఇటీవలే రిలీజై సంచలన విజయం సాధించింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం దాదాపు రూ.430 కోట్ల కలెక్షన్‌లను సాధించింది. ప్రస్తుతం రణ్‌బీర్, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఆలియా ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’తో పాటు హాలీవుడ్ చిత్రం ‘హార్ట్ ఆఫ్ స్టోన్’ సినిమాలను చేస్తుంది.