Business

అమెరికా నుంచి అరబిందో ఔషధాలు రికాల్‌

అమెరికా నుంచి అరబిందో ఔషధాలు రికాల్‌

తయారీ లోపాల కారణంగా అమెరికా నుంచి వివిధ ఔషధ ఉత్పత్తుల్ని అరబిందో ఫార్మా రికాల్‌ చేసింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ యూఎస్‌ సబ్సిడరీ అరబిందో ఫార్మా యూఎస్‌ఏ ఇంక్‌..9,504 క్వినాప్రిల్‌ బాటిల్స్‌ను, హైడ్రోక్లోరోథిజైడ్‌ ట్యాబ్లెట్లను రికాల్‌ చేసినట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ రిపోర్ట్‌లో తెలిపింది. అధిక రక్తపోటు చికిత్సకు ఉపయోగించే ఈ ఔషధాల్ని ఇండియాలో తయారుచేసి, అమెరికాలో అరబిందో ఫార్మా యూఎస్‌ మార్కెట్‌ చేసింది. అలాగే అరబిందో ఫార్మా యూనిట్‌ అరోమెడిక్స్‌ ఫార్మా ఎల్‌ఎల్‌సీ..అమెరికా మార్కెట్‌ నుంచి 11,520 ఫొండాపారినుక్స్‌ సోడియం ఇంజెక్షన్‌ యూనిట్లను రికాల్‌ చేసినట్టు యూఎస్‌ఎఫ్‌డీఏ మరో ప్రకటనలో తెలిపింది.