Sports

స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు బ్రెజిల్‌ గౌరవ పౌరసత్వం

స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు బ్రెజిల్‌ గౌరవ పౌరసత్వం

బ్రిటన్‌కు చెందిన స్టార్‌ రేసర్‌ లూయిస్‌ హామిల్టన్‌కు బ్రెజిల్‌ దేశం గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది. ఈ వారాంతంలో జరిగే బ్రెజిలియన్‌ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు హామిల్టన్‌ ఇక్కడకు వచ్చాడు. గతంలో హామిల్టన్‌ మూడుసార్లు బ్రెజిలియన్‌ రేస్‌ను గెలుచుకున్నాడు. గత నవంబర్‌లో హామిల్టన్‌కు గౌరవ పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనితో మంగళవారం బ్రెజిల్‌ కాంగ్రెస్‌ చాంబర్‌లో హామిల్టన్‌కు గౌరవ పౌరసత్వం అందజేశారు. తనకు లభించిన ఈ గౌరవం పట్ల హామిల్టన్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ స్టార్‌ రేసర్‌ ఏడు సార్లు ఫార్ములా1 చాంపియన్‌గా నిలిచాడు.
Lewishamilton