Movies

తమన్నాలా ఉన్నానని…

తమన్నాలా ఉన్నానని…

ఉదయ్‌ శంకర్‌, జెన్నీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ’. శ్రీరామ్‌ ఆర్ట్స్‌ పతాకంపై అట్లూరి ఆర్‌ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. గురు పవన్‌ దర్శకుడు. లవ్‌, థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు తెలిపింది నాయిక జెన్నిఫర్‌ ఇమ్మాన్యుయేల్‌. ఆమె మాట్లాడుతూ…‘ఈ సినిమాలో నేను సంధ్య అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. ఈ పాత్రకు రెండు భిన్నమైన షేడ్స్‌ ఉంటాయి. కొద్దిగా ప్రతినాయికలా అనిపిస్తాను. నా పాత్రకు ఒక ట్విస్ట్‌ కూడా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు తర్వాత సన్నివేశం ఎలా ఉండబోతుందనే ఆసక్తి కలిగింది.