Movies

బికినీలోనూ అందం ఉంది

బికినీలోనూ అందం ఉంది

‘‘నచ్చింది గాళ్‌ ఫ్రెండూ’ ఓ కొత్త తరహా ప్రయత్నం. మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. నా పాత్రలో పలు భిన్నమైన కోణాలుంటాయి’’ అన్నారు జెన్నీఫర్‌ ఇమ్మాన్యుయేల్‌. ఆమె కథానాయికగా నటించిన చిత్రమిది. శుక్రవారం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా జెన్నీ మాట్లాడుతూ ‘‘తెలుగులో నా రెండో సినిమా ఇది. ‘బాయ్స్‌ విల్‌ బీ బాయ్స్‌’ అనే ఓ సినిమా చేశాను. అది విడుదల కాకముందే ఈ చిత్రంలో అవకాశం వచ్చింది. కరోనా సమయంలో… జూమ్‌ కాల్‌ ద్వారానే ఆడిషన్‌ ఇచ్చాను.అలా ఈ సినిమాకి ఎంపికయ్యాను. నా పాత్ర రెండు రకాల కోణాల్లో సాగుతుంది. గ్రే షేడ్స్‌ కూడా ఉంటాయి. కథానాయిక పాత్రకు ఇంత ప్రాధాన్యం ఉండడం నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సినిమాలోని ఓ పాటలో బికినీలో కనిపించాను. బికినీ అంటే అందాల ఆరబోతకే అనుకొంటారు. కానీ.. అందులోనూ ఓ అందం ఉంది. ఆ పాట తెరకెక్కిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొన్నా. రెండు రోజుల పాటు.. చాలా తక్కువ తక్కువ తిన్నా. టైటిల్‌ చూస్తే ఇదో ప్రేమ కథలా అనిపిస్తుంది. కానీ చాలా ట్విస్టులు ఉంటాయి. ఉదయ్‌ శంకర్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉంది. తెలుగు చిత్రసీమకు నేను పూర్తిగా కొత్త. ఉదయ్‌కి కొంత అనుభవం ఉంది. ఆయన సలహాలు, సూచనలు నాకు ఉపయోగపడ్డాయి. తెలుగు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీఆర్‌, సమంతలను అభిమానిస్తాను. ఇక్కడ మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉంద’’న్నారు.