సౌదీ అరేబియా విజిటర్లకు తీపి కబురు చెప్పింది. సింగిల్ ఎంట్రీ విజిట్ వీసాల గడువును మూడు నెలలు పొడిగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం సమావేశమైన ఆ దేశ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అల్-యమామా ప్యాలెస్లో రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ వీక్లీ సెషన్లో భాగంగా వీసా వ్యవస్థలో మార్పులకు ఆమోదం తెలిపింది. విజిట్ వీసాల సింగిల్ ఎంట్రీ వాలిడిటీని పెంచుతూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం అన్ని రకాల ప్రయోజనాలకు వర్తిస్తుంది. వీసా వ్యవస్థలో తాజా సవరణల ప్రకారం విజిటర్లకు ట్రాన్సిట్ వీసా చెల్లుబాటు గడువు మూడు నెలలు, బస వ్యవధి 96 గంటలు పూర్తి ఉచితంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం సింగిల్ ఎంట్రీ ఫ్యామిలీ విజిట్ వీసాలు 30 రోజులు చెల్లుబాటు అవుతుండగా, మల్టిపుల్ ఎంట్రీ వీసాలు 90 రోజులు చెల్లుబాటు అవుతాయి.