DailyDose

TNI నేటి తాజా వార్తలు

TNI  నేటి తాజా  వార్తలు

*ప్రభుత్వం, గవర్నర్‌ మధ్య అగ్గి మరింత రాజుకుంది. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు విషయంలో తాజాగా వివాదం మొదలైంది. ఈ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి , రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. గవర్నర్‌ లేఖపై సబిత స్పందించారు. గవర్నర్‌ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని, గవర్నర్‌ని కలవమని ప్రభుత్వం తనను ఆదేశించిందని తెలిపారు. గవర్నర్‌ని కలిసి సందేహాలు నివృత్తి చేస్తామని సబిత ఇంద్రారెడ్డి ప్రకటించారు. యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లుపై చర్చించడానికి నేరుగా విద్యా శాఖ మంత్రి రాజ్‌భవన్‌ కు రావాలని గవర్నర్‌ తమిళిసై ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిని నేరుగా సీఎం ముఖ్య కార్యదర్శికి పంపారు. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పెద్ద ఎత్తున పోస్టులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి.

*గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు బెయిల్ మంజూరైంది. 40 రోజులుగా జైలులో ఉన్న ఆయనకు తెలంగాణ హైకోర్టుషరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది.

*రాజేంద్రనగర్, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్‌లో ఐటి, ఈడీ సంయుక్తంగా సోదాలు చేపట్టాయి. నాలుగవ అంతస్తులో ఉన్న గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ కార్యాలయంలో అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్నారు.సోమాజిగూడలో గ్రానైట్ వ్యాపారి శ్రీధర్ నివాసంతో పాటు పలు కార్యాలయాల్లో ఈడీ, ఐటీ అదికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రానైట్ క్వారీ నిర్వహకులు ఫేమ నిబంధనలు ఉల్లంఘించారనే ఫిర్యాదు మేరకు దాడులు చేశారు. 8 ఏజెన్సీలకు గతంలో ఈడీ నోటీసులు ఇచ్చింది. తక్కువ పరిమాణం చూపి ఎక్కువ గ్రైనేట్ కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

*తెలంగాణలో ఏడాది నుంచి పని చేస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడం ఏంటో విచిత్రంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆహ్వానం ఇవ్వలేదన్నారు. ప్రధాని తెలంగాణ పర్యటనకు సంబంధించి పీఎంవో ప్రోటోకాల్ పాటించకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం పగ పట్టిందని, రాష్ట్ర పర్యట‌నలో తెలంగాణకు ఏం‌ ఇస్తారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌కు లక్ష కోట్లు ఇస్తున్న మోదీ.. దేశానికి ప్రధానా? లేక గుజరాత్‌కా? అని ప్రశ్నించారు. కేంద్రం బీజేపీ యేతర రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.

*ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనలో తొమ్మిది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మోదీ పర్యటన సందర్భంగా ఇదే అజెండా అని.. వేరే అజండా ఏమీ లేదని అన్నారు. ఇవి కాకుండా.. ఎవరు ఏమైనా ప్రచారం చేసుకుంటే తమకు సంబంధం లేదన్నారు. రైల్వే జోన్ శంకుస్థాపన ఈ రోజు వరకు లేదని, అభివృద్ధి కార్యక్రమాలకు మాత్రమే ప్రధాని వస్తున్నారని స్పష్టం చేశారు. చిన్న చిన్న విషయాలను రాజకీయం చేయొద్దన్నారు. అభివృద్ధి అజెండాగానే ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని జీవీఎల్ స్పష్టం చేశారు.

*మనీ లాండరింగ్ కేసులో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్‌ (Sanjay Raut)కు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ (Bail) మంజూరు చేసింది. శివసేన రాజ్యసభ సభ్యుడుగా, ఫైర్‌బ్రాండ్ నేతగా పేరున్న సంజయ్ రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్ 21న తీర్పు రిజర్వ్ చేసింది.

*ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పై హుటాహుటిన మరమ్ములు చేస్తున్నారు.

*శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జిల్లాలోని సోంపేట మండలం పలాసపురం వద్ద పలాస నుంచి ఇచ్ఛాపురం వైపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్‌ వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో ఒక్కసారిగా బస్‌ పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. బస్‌ డ్రైవర్‌ చాకచక్యంగా బస్‌ను ఆపడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. కాగా ప్రయాణికులను మరో బస్‌లో గమ్యస్థానాలకు చేర్చారు.

*తెలంగాణలో ఏడాది నుంచి పని చేస్తున్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మళ్లీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించడం ఏంటో విచిత్రంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీసం ఆహ్వానం ఇవ్వలేదన్నారు. ప్రధాని తెలంగాణ పర్యటనకు సంబంధించి పీఎంవో ప్రోటోకాల్ పాటించకపోవడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ ప్రజలను నమ్మించేందుకు మరో నాటకానికి తెరలేపారని విమర్శించారు. తెలంగాణపై కేంద్రం పగ పట్టిందని, రాష్ట్ర పర్యట‌నలో తెలంగాణకు ఏం‌ ఇస్తారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్‌కు లక్ష కోట్లు ఇస్తున్న మోదీ.. దేశానికి ప్రధానా? లేక గుజరాత్‌కా? అని ప్రశ్నించారు. కేంద్రం బీజేపీ యేతర రాష్ట్రాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు.

*గన్నవరం కాటా సమీపంలో అపెక్స్ కాస్టింగ్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే విజయవాడ ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ఇనుమును కరిగించే క్రమంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. విధుల్లో ఉన్న కార్మికులపై అగ్ని రవ్వలు పడడంతో కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. పేలుడుపై ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. సంఘటనా ప్రదేశంలో క్లూస్‌ను సేకరించారు. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఘటన జరుగగా… గోప్యంగా ఉంచేందుకు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రయత్నించింది

*మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి (Ayyannapatrudu)కి ఏపీ హైకోర్టు (AP High Court)లో భారీ ఊరట లభించింది. పది సంవత్సరాల పైన శిక్ష పడే సెక్షన్ 467 ఈ కేసులో వర్తించదని కీలక తీర్పును హైకోర్టు వెలువరించింది. ప్రాథమిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయానికి వచ్చామని కోర్టు చెప్పింది. జలవనరుల శాఖ అధికారులు ఇచ్చిన ఎన్‌ఓసీ.. విలువైన పత్రాల నిర్వచనం కిందకు రాదని హైకోర్టు స్పష్టం చేసింది. అర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శక సూత్రాల ప్రకారం నడుచుకోవాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. సీఆర్‌పీసీలోని 41 ఏ కింద అయ్యన్నపాత్రుడికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. సిఐడీ విచారణ జరుపుకోవచ్చని హైకోర్టు పేర్కొంది. అయ్యన్నపాత్రుడిపై సిఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఆయన తరుపు న్యాయవాది వీవీ సతీష్‌ హైకోర్టును ఆశ్రయించారు. గత వారం ప్రభుత్వం, అయ్యన్నపాత్రుడు తరపు న్యాయవాదుల వాదనలను విన్న అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రోజు అయ్యన్నపాత్రుడి కేసులో ఐపీసీలోని సెక్షన్ 467 వర్తించదని కోర్టు స్పష్టం చేసింది

*నెహ్రూనగర్‌లో ట్యూషన్‌కు వెళ్లిన ఐదుగురు విద్యార్థుల అదృశ్యం కలకలం రేపుతోంది. 10వ తరగతి చదువుచున్న ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. తమ పిల్లలింకా ఇంటికి రాలేదంటూ తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరవుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన తిరుపతి వెస్ట్ పోలీసులు.. అదృశ్యమైన వారి కోసం మూడు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌కు కొత్త అర్ధాలు చెప్పారు. కాంగ్రెస్ అంటేనే ‘అస్థిరత’ అని, అవినీతి, కుంభకోణాలు ఖాయమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, హిమాచల్ ప్రదేశ్‌లో ఎప్పుడూ స్థిరమైన పాలనను కాంగ్రెస్ ఇవ్వలేకపోయిందని అన్నారు. కాంగ్రెస్‌కు రెండే రెండు రాష్ట్రాలు…రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ మిగిలాయని, అక్కడ అభివృద్ధికి సంబంధించిన వార్తలే వినిపించవని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్‌కు ఇవాళ సుస్ధిర ప్రభుత్వం కావాలని, హిమాచల్ ప్రదేశ్‌లో పటిష్ట ప్రభుత్వం ఉంటే, డబుల్ ఇంజన్ పవర్‌తో అన్ని సవాళ్లను అధిగమించి సరికొత్త పుంతలు తొక్కుతుందని అన్నారు. శక్తిపీఠాల భూమి కాంగ్రా అని, భారతదేశ విశ్వాసాలు, ఆధ్యాత్మికతను తెలియజెప్పే యాత్రాస్థలి అని అన్నారు. రాజ్‌నాథ్ నుంచి కాఠ్‌గఢ్ వరకూ బాబా బోలే (శివుడు) మనతోటే ఉన్న అనుభూతి కలుగుతుందని అన్నారు.

*రీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో ఐటీ, ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గంగుల ఇంటి తాళాలు పగులగొట్టి మరీ ఈడీ సోదాలు జరుపుతోంది. ఆయన సోదరుల ఇళ్లల్లోనూ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం గంగుల తన కుటుంబంతో సహా దుబాయ్‌ (Dubai)లో ఉన్నారు. ఈడీ సోదాల నేపథ్యంలో హుటాహుటిన ఆయన కరీంనగర్‌)కు బయల్దేరారు.అలాగే కరీంనగర్‌లోని పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో సైతం ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని ఫిర్యాదు రావడంతో ఐటీ, ఈడీ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. మంకమ్మతోట, కమాన్‌ చౌరస్తా, బావుపేటలో ఈ సోదాలు జరుగుతున్నాయి. అరవింద గ్రానైట్స్, శ్వేత గ్రానైట్స్‌ కంపెనీల్లో తనిఖీలు చేపట్టింది. గ్రానైట్‌ వ్యాపారులు గంగాధరరావు, అరవింద్‌ వ్యాస్ ఇళ్లల్లో సైతం సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌, కరీంనగర్‌లోని మొత్తం 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ దాడులు నిర్వహిస్తోంది.

* హైద‌రాబాద్ ప‌రిధిలోని ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో చేప‌ట్టాల్సిన అభివృద్ధి పనుల‌పై ప్ర‌తిపాద‌న‌ల‌ను వీలైనంత త్వ‌ర‌గా సిద్ధం చేయాల‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ సూచించారు. మ‌సాబ్ ట్యాంకులోని త‌న కార్యాల‌యంలో మంత్రి త‌ల‌సాని ప‌లువురు ఎమ్మెల్యేల‌తో బుధ‌వారం స‌మావేశం నిర్వ‌హించారు.

*నైరుతి బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనం పరిసరాల్లో 7.6 కి.మీ వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశముందని వివరించారు. అల్పపీడనం ఈనెల 12 లోగా తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం చేరుకునే అవకాశముందని తెలిపారు.

*హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరుగుతాయని, గుజరాత్‌లో గత రికార్డులను బీజేపీ అధిగమిస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. తన స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో ఆయన సుడిగాలి ప్రచారం సాగిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ప్రతిరోజూ దాదాపు 15 నుంచి 16 ర్యాలీల్లో ప్రచారం సాగిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్, గుజరాత్‌లో పార్టీ విజయం తథ్యమని ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

* మనీ లాండరింగ్ కేసులో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం సీనియర్ నేత సంజయ్ రౌత్‌ (Sanjay Raut)కు ప్రత్యేక కోర్టు బుధవారంనాడు బెయిల్ (Bail) మంజూరు చేసింది. శివసేన రాజ్యసభ సభ్యుడుగా, ఫైర్‌బ్రాండ్ నేతగా పేరున్న సంజయ్ రౌత్ గత మూడున్నర నెలలుగా జైలులో ఉన్నారు. బెయిలు దరఖాస్తుపై రౌత్, ఈడీ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ప్రత్యేక కోర్టు అక్టోబర్ 21న తీర్పు రిజర్వ్ చేసింది.

*కొండమడుగు ఇండస్ట్రీ ఏరియాలో ఆస్ట్రర్ రసాయన పరిశ్రమను ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ కొండమడుగు పరిసరాల్లో పాత మిషనరీ ద్వారా నడుస్తున్న రసాయన పరిశ్రమలు వెంటనే తొలగించాలన్నారు. పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని, ప్రతిష్టాత్మకమైన ఎయిమ్స్ హాస్పిటల్ కొండమడుగు పక్కనే ఉందన్నారు. కొండమడుగు ఇండస్ట్రీయల్ జోన్ నుంచి తొలగించి రెసిడెన్షియల్ జోన్‌గా చేయాలని డిమాండ్ చేశారు. కొండమడుగులో ఉన్న రసాయన పరిశ్రమలను తొలగించే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 90 కోట్లు కట్టకపోవడంతో రాయగిరికి వచ్చే ఎంఎంటిఎస్ ఆగిపోయిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

*బుధవారం తెల్లవారుజామున భూప్రకంపనలు నేపాల్, ఢిల్లీ పరిసర ప్రాంతాలను వణికించాయి. పొరుగున ఉన్న నేపాల్ దేశంతోపాటు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌,పిథోరాఘడ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున 1.57 గంటలకు భూ ప్రకంపనలు సంభవించాయి. వణికిస్తున్న చలిలో తెల్లవారుజామున సంభవించిన భూప్రకంపనలతో గాఢ నిద్రలో ఉన్న ఢిల్లీ ప్రాంత ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. నేపాల్ కేంద్రంగా సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ( వెల్లడించింది.నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి కూడా రెండు సార్లు భూమి కంపించింది. గడచిన 12 గంటల్లో నేపాల్ దేశంలో మూడు సార్లు భూకంపం వచ్చిందని అధికారులు చెప్పారు. నేపాల్ దేశంలో మంగళవారం రాత్రి 8.52 గంటలకు సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.9గా నమోదైంది. తర్వాత మంగళవారం రాత్రి 9.41 గంటలకు 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది.

*జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu And Kashmir) దోడాలోని ప్రేమ్‌నగర్ ప్రాంతంలో మంగళవారం రాత్రి వేగంగా వస్తున్న ఓ కారు చీనాబ్ నదిలో పడిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. కారు చీనాబ్ నదిలో(river Chenab) పడిపోవడంతో మృతుల జాడ కోసం గాలిస్తున్నామని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. చీనాబ్ నదిలో పడిన కారులోని(Car) నలుగురు వ్యక్తులు మరణించారని మెజిస్ట్రేట్ అథర్ అమీన్ జర్గర్ చెప్పారు. నలుగురు వ్యక్తులతో వెళుతున్న ఒక ప్రైవేట్ కారు ప్రమాదవశాత్తు థాత్రి, ప్రేమ్ నగర్ మధ్య షిబ్నోట్ వద్ద చీనాబ్ నదిలో పడిపోయిందని, మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తన్నామని జమ్మూకశ్మీర్ దోడా(Doda) డిప్యూటీ కమిషనర్ విశేష్ పాల్ మహాజన్ చెప్పారు.

*నకిలీ రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ ఇవ్వడంతో తన తండ్రి చనిపోయాడంటూ ఖమ్మంలోని ప్రైవేటు ఆస్పత్రి వైద్యుడిపై యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో పోలీసులు ఆస్పత్రి వైద్యుడు, ఇద్దరు సిబ్బందిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్‌ ఖైదీగా వైద్యుడు వారం రోజులు జైల్లో ఉన్నారు. అయితే, ఇందులో అసలు కథ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను వైద్యుడు మంగళవారం ఖమ్మంలో వెల్లడించారు. ఆయన చెప్పినదాని ప్రకారం.. ఖమ్మం రూరల్‌ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన భద్రయ్య 2021 ఏప్రిల్‌ చివరి వారంలో కరోనా బారిపడ్డాడు. అతడిని కుమారుడు సందీప్‌, బావమరిది కల్యాణ్‌ ఖమ్మంలోని డాక్టర్‌ జి. శ్యాంకుమార్‌కు చెందిన బాలాజీ చెస్ట్‌ అండ్‌ డయాబెటిక్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే భద్రయ్య మరోక్లినిక్‌లో చికిత్స పొందాడు.

*రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా కొని.. విదేశాలకు ఎగుమతి చేస్తూ వైసీపీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. పేదలకు కేంద్రం ఇస్తున్న రేషన్‌ బియ్యాన్ని దారి మళ్లించి వైసీపీ నేతలు కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేసి డబ్బు సంపాదిస్తున్నారని, అధికారం అండతో రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ను అడ్డూ అదుపూ లేకుండా నడిపిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం చెప్పారు. మంగళవారం ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో 2018-19లో కాకినాడ పోర్టు నుంచి 18 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అయితే 2020-21లో 32 లక్షల టన్నులు ఎగుమతి అయ్యాయి. 2021-22 నాటికి ఏకంగా 49 లక్షల టన్నులకు పెరిగాయి. ఈ మూడేళ్లలో ఎగుమతులు 125 శాతం పెరిగాయి. కానీ బియ్యం ఉత్పత్తి మాత్రం చాలా తక్కువగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ఉత్పత్తి 2018-19లో 82 లక్షల టన్నులు ఉంటే 2021-22లో 89 లక్షల టన్నులు. ఉత్పత్తి విపరీతంగా పెరగలేదు కానీ బియ్యం ఎగుమతులు మాత్రం అసాధారణంగా పెరిగాయి.

*హైదరాబాద్‌కు గ్రీన్‌ సిటీ అవార్డు రావడం.. పచ్చదనం పెంపుపై ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం గ్రీన్‌ సిటీ బ్రీఫింగ్‌ వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. హెచ్‌ఎండీఏ పరిధిలో లే అవుట్లు, బహుళ అంతస్తుల భవనాల అనుమతి సమయంలోనే నిర్ణీత విస్తీర్ణంలో పచ్చదనం తప్పనిసరగా ఉండాలనే నిబంధన పెట్టినట్టు పేర్కొన్నారు. నగరంలో ఫార్ములా-ఈకు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో తొలగిస్తోన్న చెట్లను మరో చోట నాటుతున్నట్టు వెల్లడించారు.

* బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై వివాదం ముదురుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు ఆడుతూ విపక్ష ప్రభుత్వాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌లో తమకు గవర్నర్లు తీవ్ర తలనొప్పులు సృష్టిస్తున్నారని ప్రభుత్వాలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. గవర్నర్ల తీరు కూడా అలాగే ఉన్నది.

* తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో హైదరాబాద్‌ గోల్ఫ్‌ అసోసియేషన్‌ (హెచ్‌జీఏ) ఆధ్వర్యంలో గోల్కొండ మాస్టర్స్‌ టోర్నీకి మంగళవారం తెరలేచింది. యువజన, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈనెల 12 వరకు జరిగే టోర్నీలో మొత్తం 125 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతున్నారు. ఒలింపియన్‌ ఉదయన్‌ మానె, డిఫెండింగ్‌ చాంపియన్‌ మను గందాస్‌, యువరాజ్‌సింగ్‌, వరుణ్‌ పారిఖ్‌, షమీమ్‌ఖాన్‌, నవీద్‌కౌల్‌ లాంటి స్టార్‌ గోల్ఫర్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు హైదరాబాద్‌కు చెందిన హైదర్‌ హుస్సేన్‌, అజర్‌, హార్దిక్‌, తేజ్‌ బరిలో ఉన్నారు.

* ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం (రాజమండ్రి)లో గూడ్సు రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజమహేంద్రవరం స్టేషన్‌ సమీపంలో గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఒకే ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా-చెన్నై రహదారిలో రైళ్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రాక్‌పై హుటాహుటిన మరమ్ములు చేస్తున్నారు.