పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ ఆడిపాడనుంది. మెగా సూర్య ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. క్రిష్ జాగర్లమూడి దర్శకుడు. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉంది. పవన్ రాజకీయ పర్యటనల కారణంగా ఆలస్యమవుతూ వచ్చిన ఈ సినిమా ఇక నుంచి స్పీడు పెంచనుంది. ఈ చిత్రానికి విరామం లేకుండా సమయం కేటాయించాలని పవన్ నిర్ణయించుకున్నారు. అన్ని హంగులతో సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవికి విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. దీంతో వేసవిలో బాక్సాఫీస్ వద్ద పవన్ సందడి చేయనున్నట్లు తెలుస్తున్నది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో త్వరలోనే ప్రకటన రానుంది.