Devotional

‘పంచారామాలు” అనగా ఏమిటి? – TNI ఆధ్యాత్మికం

‘పంచారామాలు” అనగా ఏమిటి? –  TNI ఆధ్యాత్మికం

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధమైన “శైవక్షేత్రాలను”, “పంచారామాలు’ అని పిలుస్తారు. ‘పంచారామాలు’ ఏర్పడుటకు, స్కందపురాణంలో ఇలా వివరించబడి యున్నది. పూర్వం.. తారకాసురుడు అను రాక్షసుడు, ‘శివుని’ గురించి ఘోర తపస్సు చేసి ‘శివుని’ ఆత్మలింగము సంపాదిస్తాడు. దీనితో వీర గర్వముతో, దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా, ఇందుకు దేవతలు, విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ‘శివపార్వతుల’ వల్ల కలిగిన కుమారుడు “కుమారస్వామి” వల్లనే తారకాసురుని వధించుట సాధ్యపడుతుందని తెలిపి “కుమారస్వామిని” యుద్ధానికి పంపుతారు. యుద్ధమునందు “కుమారస్వామి”, తారకాసురుని కంఠంలో గల ‘ఆత్మలింగమును’ చేధిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ ‘లింగమును’ చేధిస్తాడు. దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేధిoచే సమయంల్లో, ఆ.. ‘ఆత్మలింగము’ వేరై, ఐదు ప్రదేశములలో పడుతాయి. తరువాత వాటిని ఆ…యా…ప్రదేశాలలో, దేవతలు లింగ ప్రతిష్ఠ కావిస్తారు.. కనుక ఈ అయిదు ‘క్షేత్రాలను’, ‘పంచారామాలు’ అని పిలుస్తారు..
1. దాక్షారామము :
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని “భీమేశ్వరుడు” అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరిఇయు సగభాగం నలుపుతో ఉంటుంది.ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు. ఈ ఆలయం చాళుక్యరాజయిన, భీముడు నిర్మించాడని పురాణాలలో చెప్పబడి యున్నది. అనేక పురాణాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావన ఉంది. పూర్వకాలంలో ఎంతో మంది దేవతలు, రాజులు స్వామి వారిని దర్శించుకొని, తరించారని తన ‘భీమేశ్వర పురాణంలో’ చెప్పబడి యున్నది. ఈ ఆలయంలో శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ “మహాశివరాత్రి” పర్వదినం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
2. అమరారామము :
పంచారామల్లో రెండవదైన ‘అమరారామము’, గుంటూరు జిల్లాలోని అమరావతిలో కృష్ణానదీతీరమునందు వెలసినది. ఇక్కడ స్వామిని “అమరేశ్వరుడు” అని పిలుస్తారు. గర్భగుడిలో స్వామి విగ్రహం 9 అడుగుల ఎత్తులో, తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ఈ ఆలయం 20 అడుగుల ఎత్తుగల విశాలమైన వేదికపైన నిర్మించబడింది.అమరేశ్వరుడైన ‘ఇంద్రుడు’ చేత ప్రతిష్టించి ఈ ఆలయానికి తన నగరమైన అమరావతి పేరునే పెట్టారు అని పురాణాలలో చెప్పబడి యున్నది.
3. క్షీరారామము :
క్షీరారామము, పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో కలదు. ఇక్కడ ‘శివుని’ మూర్తిని “శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి” అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని త్రేతాయుగ కాలంలో ‘సీతారాములు’ కలిసి ప్రతిష్ఠించారట. ఈ గ్రామానికి పాలకొల్లు అని పేరు రావడానికి కూడా ఒక కధ ఉంది. ‘శివుడు’ తన బాణమును భూమిలోనికి వెయ్యగానే భూమి నుండి పాలధార వచ్చిందట. క్షీరం అనగా పాలు, దీనిమూలంగా క్షీరపురి అనే పేరు వచ్చింది. క్రమంగా ‘క్షీరపురి’ కాస్తా ‘పాలకొల్లుగా’ మార్పు చెందింది. స్వామి వారి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆలయం 125 అడుగుల ఎత్తులో ‘9’ గోపురాలుతో కట్టబడింది. 🌺
4. సోమారామము :
పంచరామాల్లో నాల్గవదైన “సోమారామము”. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరానికి రెండు కిలోమిటర్లు దూరంలో గల గునిపూడిలో కలదు. ఇక్కడ స్వామి వారిని “సోమేశ్వరుడు” అని పిలుస్తారు. ఇచ్చట ‘శివలింగానికి’ ఒక ప్రత్యేకత ఉంది. మాములు రోజుల్లో తెలుపు రంగులో ఉండే ‘శివలింగం’, అమావాస్య రోజు వచ్చేసరికి గోధుమ రంగులోనికి మారుతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యధాస్ధానానికి చేరుతుంది.
ఇక్కడ స్వామిని ‘చంద్రుడు’ ప్రతిష్టించాడు. చంద్రునిచే ప్రతిష్ఠించ బడినది కావున దీనికి ‘సోమారామము’ అని పేరు వచ్చింది.
5. కుమారభీమారామము :
పంచారామాల్లో చివరిది, 5వది అయిన ‘కుమారభీమారామము’, తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోటకు కిలోమిటరు దూరంలో కలదు. ఇక్కడ స్వామిని “కాల బైరవుడు” అని పిలుస్తారు.ఈ ఆలయాన్ని దాక్షారామాన్ని నిర్మించిన, చాళుక్య రాజయిన భీముడు ఈ ఆలయాన్ని కూడా నిర్మించాడు. ఇక్కడి ‘శివలింగం’ సున్నపురాయితో చేసినదిలాగా ఉంటుంది. ఈ ఆలయంలో “మహశివరాత్రి” ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

2. ఇదిగో అయోధ్య రాములోరి గంట
అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయం కోసం 650 కిలోల కంచు గంట సిద్ధమైంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా ఏరల్‌ గ్రామంలో ‘రామకృష్ణనాడార్‌ ఇత్తడి పాత్రల దుకాణం’ వారు ఈ గంటను తయారు చేశారు. దుకాణం యజమాని ఆర్‌.రామనాధన్‌ ఈసందర్భంగా మాట్లాడుతూ.. అయోధ్య రామాలయం కోసం 2020 నుంచే గంటను రూపొందిస్తున్నట్టు తెలిపారు. నాలుగు అడుగుల ఎత్తు, 650 కేజీల బరువున్న ఈ గంటను తయారు చేసే పనుల్లో పాల్గొన్న కార్మికులకు సుమారు రెండు లక్షల రూపాయలు వేతనంగా ఇచ్చినట్టు వివరించారు. మూడున్నర దశాబ్దాలుగా తమ దుకాణంలో ఇత్తడి వస్తువులను విక్రయిస్తున్నామని, ఆలయాలకు గంటలు, పూజా పరికరాలను తయారుచేస్తున్నామని తెలిపారు. అయోధ్యరామాలయ గర్భాలయంపై మోగనున్న గంటను రూపొందించే అవకాశం లభించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. గంటను రామేశ్వరం ఆలయానికి తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయోధ్యకు తరలిస్తామన్నారు.ళ్లు, వెన్నెముక విపరీతమైన నొప్పికి గురవుతాయి. ప్రయాణ సమయంలోనూ జాగ్రత్త వహించాలి. ఇక డోలీ ద్వారా వెళ్లాలంటే దాదాపు రూ.5500 ఖర్చవుతుంది. నలుగురు మనుష్యులు కలిసి మోసుకెళ్తారు.వీళ్లంతా నేపాలీలు. బహుమర్యాదగా ఉంటారు. దాదాపు ఆరు గంటల పాటు ప్రయాణం సాగుతుంది. కాలిబాటన వెళ్లే వారు కూడా చాలా మంది ఉంటారు. అయితే 40 సంవత్సరాలు వయస్సు దాటిన వారు ఏ మాత్రం ప్రయత్నించకపోవడం మంచిది.కాలినడకన వెళ్తే దాదాపు పది గంటలు పడుతుంది. అయితే బాగా అలిసిపోతారు. ఓ వైపు లోయ, మరోవైపు జారే మెట్లతో అత్యంత ప్రమాదకరంగా సాగుతుంది. ఏడు కిలో మీటర్ల తర్వాత రాంబాడా అనే ప్రాంతంలో టీ, కాఫీ, ఫలహారాలు దొరుకుతాయి.చీకటి పడితే పడుకోడానికి వసతి సౌకర్యాలు కూడా ఉంటాయి. ఈ ప్రయాణంలో ప్రధాన అవరోదం వాతావరణం. గౌరీకుండ్ లో మాములుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది, చలి పెరుగుతుంది. పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.కేదారినాథ్ కొండపైన 5డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడ హిమపాతం, చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు
** అలయమార్గం
కేదార్‌నాథ్ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్ నుండి కాలిబాటలో వెళ్ళాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను, బుట్టలలోనూ చేరుస్తుంటారు.బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్ళు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రీకులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు.వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకు వెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్ లోని వారి బస వరకు తీసుకు వస్తారు.పనివాళ్ళ కోరికపై అనేకమంది యాత్రికులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రీకుల నిర్ణయం మాత్రమే.మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు వీరందిస్తారు.ఈ ప్రయాణానికి వెళ్ళే సమయం 5 నుండి ఆరు గంటలు వచ్చే సమయం 3 నుండి నాలుగు గంటలు ఇదికాక దర్శన సమయం అదనం. వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్ళడం సహజం కానీ ఇది చాలా అరుదు.వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు, రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు.ఆలయమునకు అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండ్‌లో ఆక్సిజన్ సిలిండర్లు వారి బస యజమానులు సరఫరా చేస్తుంటారు.వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కొంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచుతో కప్పబడి ఉంటుంది.పేరుకుపోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదిని మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది.
ఉత్తరకాశి నుండి హెలికాఫ్టర్ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది, పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది.ఉత్తరకాశి నుండి ఉదయం 6 నుండి 7 గంటల సమయం నుండి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.
** ఆలయ గర్భగుడి-బంగారు తాపడం
స్వర్ణశోభితమైన ఈ కేదారనాథ్ ఆలయంలో చెప్పుకోదగ్గ మరో విశేషం.. దాదాపు 230కేజీల బంగారాన్ని కరిగించి, 550 బంగారపు రేకులతో ఆలయ గర్భగుడిలోని గోడలు, పైకప్పును ముస్తాబు చేశారు. ముందు వెండి రేకులతో తాపడం చేసి ఉండగా,ఈసారి వెండి రేకులు కప్పలేని గర్భగుడిలో భాగాల్ని సైతం బంగారపు రేకుల్ని వాడి, గోడలకు తాపడం చేయడం జరిగింది. రూర్కీలోని ఐఐటీ, సెంట్రల్‌ బిల్డింగ్‌ రీసెర్చ్‌,పురావస్తు శాఖకు చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ సమక్షంలో మూడు రోజులు పాటూ జరిగిన ఈ అలంకరణ పనులు పురావస్తు శాఖకు చెందిన ఇద్దరు అధికారుల సమక్షంలో 19 మంది కళాకారులు ఈ పని పూర్తి చేశారు.
*** గర్భగుడి
కేదార్ నాథ్ ఆలయం గర్భగుడిలో అందరూ ఊహించినట్టు శివలింగం ఉండదు. కేవలం ఒక ఎద్దు వెనుకభాగంలా మాత్రమే కనిపిస్తుంది. దాన్నే భక్తులందరూ ఎంతో నిష్ఠతో పూజిస్తారు. దీని వెనక ఓ కథ ఉంది.
కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఎంతో పశ్చతాపంలో ఉంటారట. యుద్ధంలో ఎందరినో హత్య చేశాం కాబట్టి ఆ పాతకం తమకు అంటుకుంటుందని, దాన్నుంచి పాపవిమోచనం కోసం శివుడిని దర్శించుకోవాలనుకుంటారు.ద్రౌపదితో కలిసి అయిదుగురు హిమాలయాలకు బయల్దేరతారు. ఎన్నో రోజులు కష్టించి గాలించినా శివదర్శనం కాదు. చివరికి కేదార్ నాథ్ ఉండే చోటుకు వస్తారు. అయితే పాండవులకు దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదు. దీంతో శివుడు ఓ ఎద్దులా మారిపోతాడు.తనను గుర్తుపట్టకుండా మరిన్ని ఎద్దులను సృష్టిస్తాడు. శివుడిని వెతుక్కుంటూ వచ్చిన పాండవులకు ఆవులు, ఎద్దులు కనిపిస్తాయి. ఇంత మంచులో ఆవులు, ఎద్దులు ఎందుకు ఉన్నాయన్న అనుమానం ధర్మరాజుకు వచ్చి భీముడితో కాలు పైకెత్తమని చెబుతాడు.మరో వైపు నుంచి పాండవులంతా ఆవులను ముందుకు ఉరికిస్తారు. ఒక్కో ఆవు/ఎద్దు భీముడి కాలు కింది నుంచి బయటకు వెళ్తాయి. చివరి వంతు ఎద్దు రూపంలో ఉన్న శివుడిది. అయితే పాండవులు పాపం చేశారు కాబట్టి వారికి దర్శనం ఇవ్వడానికి శివుడికి మనసొప్పదుతప్పనిసరి పరిస్థితుల్లో పాండవులకు కనిపించొద్దన్న ఉద్దేశంతో, భీముడి కాళ్ల కింది నుంచి వెళ్లలేడు కాబట్టి .. హఠాత్తుగా మంచులోకి దూసుకుపోతాడు. పాండవులు గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఎద్దు వెనక భాగం మాత్రం అందుతుంది.అలా ధర్మరాజు చేతికి అంటిన మిగిలిన భాగమే ఇప్పుడు కేదార్ నాథ్ లో కనిపిస్తుంది. మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే ఖాట్మాండులో ప్రత్యక్షమవుతుంది.

4. పంచ రంగనాధ క్షేత్రాలు….
జలం ఏ పాత్రలోకి ఒంపితే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో…

*శ్రీ రంగపట్నం:– ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!
*తిరుప్పునగర్‌:– తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు ‘అప్పకుడతాన్‌ పెరుమాళ్‌’. ఇక్కడ ఉభమన్యు అనే రాజుకి విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట. ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట. చివరికి పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలని అందించినప్పుడే తృప్తి లభించిందట. అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.
*కుంబకోణం:– ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సుని ఆచరించాడట. దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువల నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.
*మయిలదుతురై:– చంద్రుని తపస్సుకి మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట. అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు ‘పరిమళ పెరుమాళ్‌’. వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.
*శ్రీ రంగం:– పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెప్పుకొంటారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ కలుగుతాయని నమ్మకం.

5. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల : చంద్రగ్రహణం సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. టీటీడీ అధికారులు ముందస్తు ప్రచారం చేయడంతో భక్తులు తిరుమల రాకను విరమించుకున్నారు. మ‌ధ్యాహ్నం 2.39 గంట‌లకు ప్రారంభ‌మైన చంద్రగ్రహణం సాయంత్రం 6.27 గంట‌లకు ముగిసిన అనంతరం ఆలయంలో సంప్రోక్షణ నిర్వహించారు. ఆతరువాత పూజలు నిర్వహించి రాత్రి 8.20 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు స‌ర్వద‌ర్శనం కల్పించారు. ఈరోజు రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు వేచి యున్నారు. వీరికి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు . నిన్న శ్రీవారిని 22,423 మంది భక్తులు దర్శించుకోగా 9,672 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. చంద్రగ్రహణం కారణంగా నిన్న హుండీ లెక్కింపును అధికారులు నిలిపివేశారు.

6. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో అన్నాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు ఏకాంతంగా శుద్ధోధక అభిషేకం, ఉద‌యం 3.30 నుంచి 5.30 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపట్టారు. ఉద‌యం 5.30 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పించారు. ఉద‌యం 7.30 నుంచి 8 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపట్టారు.శుద్ధి అనంతరం ఉద‌యం 8 నుండి 8.30 గంటల వరకు సుగంధద్రవ్య అభిషేకం ఏకాంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈఓ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్‌ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ బాల‌కృష్ణ తోపాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.