గర్భ నిర్ధారణకు ప్రస్తుతం మూత్ర, రక్త పరీక్షలు ఉన్నాయి. ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తొలిసారిగా లాలాజలంతో నిర్ధారించే పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేశారు. ఈ కిట్‌తో 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గర్భం వచ్చిందా? లేదా? అన్నది నిర్ధారణ చేయవచ్చని తెలిపారు. ప్రస్తుతం ఆ దేశంలో అందుబాటులోకి వచ్చిన ఈ కిట్‌ను 2023 నాటికి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.