నటించేది ఏ సినిమా అయినా తన ఇన్‌స్టింక్ట్ మారదని చెబుతున్నది అందాల తార పూజా హెగ్డే. ప్రేక్షకులకు సంతోషాన్ని పంచడమే తన లక్ష్యమని అంటున్నది. వెండితెరపై ఆమెకు ఇటీవల కొంత ఎదురుగాలి వీస్తోంది. పూజా నటించిన సినిమాలు అపజయం పాలవుతున్నాయి. గోల్డెన్ లెగ్ అన్నవాళ్లే …ఇప్పుడామె సినిమాలేవీ ఆడటం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పూజా హెగ్డే సృష్టించుకున్న స్టార్‌డమ్ ఈ కలిసిరాని కాలానికి ప్రభావితం కావడం లేదు.హిందీలో రన్వీర్‌తో ‘సర్కస్’, సల్మాన్‌తో ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్న ఈ సుందరి..తెలుగులో మహేష్ బాబు, త్రివిక్రమ్ చిత్రంలో నటిస్తున్నది. ఇటీవల ఓ సందర్భంలో పూజా హెగ్డే మాట్లాడుతూ…‘హీరోయిన్‌గా నా బాధ్యత మీ అందరికీ వినోదాన్ని, సంతోషాన్ని పంచడం. జయాపజయాలకు అతీతంగా నా ప్రతి సినిమాకు ఆ బాధ్యతను నెరవేర్చాను. సినిమాల పట్ల నా దృక్పథం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఆ సినిమాకు ఆదరణ దక్కిందా? లేదా? అనేది వేరే విషయం’ అని చెప్పింది.