అమెరికా ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా నిర్వహించే అమెరికా తెలుగు సంబరాల కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ ఎక్స్పో సెంటర్, ఎడిసన్ లో జరుగనున్న అమెరికా తెలుగు సంబరాలకు సన్నద్ధం చేసేలా తాజాగా నిర్వహించిన కిక్ ఆఫ్ ఈవెంట్‌కు భారీ స్పందన లభించింది. న్యూజెర్సీలోని ఎడిసన్ వేదికగా జరిగిన ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు వందల మంది తెలుగు ప్రజలు హాజరయ్యారు. రఘుశర్మ శంకరమంచి గణేశ ప్రార్ధన, చేసి ఈ కిక్ ఆఫ్ ఈవెంట్‌కు శ్రీకారం చుట్టారు. నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, సంబరాలు కో కన్వీనర్ వసుంధర దేసు, బిందు ఎలమంచిలి, స్వాతి అట్లూరి, ఉమ మాకం, గాయత్రీ లు జ్యోతి ప్రజ్వలన లో పాల్గొన్నారు.
నాట్స్ అధ్యక్షులు బాపు నూతి 7 వ నాట్స్ అమెరికా సంబరాలు 2023 మే 26 నుండి 28 వరకూ న్యూ జెర్సీ లో జరుగనున్నట్టు ప్రకటించి, అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసానిని సభకి పరిచయం చేసారు . ఈ సందర్భంగా “భాషే రమ్యం సేవే గమ్యం” అనే నినాదంతో స్థాపించబడిన నాట్స్ సంస్థ సేవకి, భాషకి సమ ప్రాధాన్యతనిస్తూ చేస్తున్న అనేక సేవా, సాంస్కృతిక కార్యక్రమాలను, వైద్య శిబిరాలు, కంటి శిబిరాలు ద్వారా అమెరికాలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవలను వివరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాట్స్ జాతీయ కార్యవర్గ సభ్యులను సభకు పరిచయం చేసారు. తెలుగుజాతికి నాట్స్ అండగా ఉంటుందనేది అనేక సంఘటనలు నిరూపించాయని నాట్స్ చైర్ వుమెన్ అరుణ గంటి అన్నారు.
సంబరాల కోర్ కమిటీ సభ్యులైన రాజేంద్ర అప్పలనేని – కో కన్వీనర్, వసుంధర దేసు – కో కన్వీనర్, రావు తుమ్మలపెంట (టి పి) – కోఆర్డినేటర్, విజయ్ బండ్ల – కోఆర్డినేటర్, శ్రీహరి మందాడి – డిప్యూటీ కన్వీనర్, రాజ్ అల్లాడ – డిప్యూటీ కన్వీనర్, శ్యామ్ నాళం – కాన్ఫరెన్స్ సెక్రటరీ, చక్రధర్ వోలేటి-కాన్ఫరెన్స్ ట్రెజరర్, రంజిత్ చాగంటి-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ లను సభకు పరిచయం చేసారు.ప్రముఖ తెలుగు గాయకులు హేమచంద్ర, మౌనమి ల తెలుగు పాటల ప్రవాహం ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలుగు సినీ పాటలతో..హేమచంద్ర, మౌనిమ లు తెలుగువారిలో ఉత్సాహాన్ని నింపారు. ఆద్యంతం తెలుగు ఆట, పాట లతో కిక్ ఆఫ్ ఈవెంట్ ఎంతో ఉల్లాసభరింతంగా సాగింది. వినోదాలను పంచింది. వచ్చే ఏడాది మేలో జరగనున్న 7వ అమెరికా తెలుగు సంబరాల కోసం నాట్స్ తెలుగువారిని సన్నద్ధులను చేసే క్రమంలో ఈ ఈవెంట్‌ను నిర్వహించింది.
ఈ సారి నాట్స్ తెలుగు సంబరాలు న్యూజెర్సీ వేదికగానే అంగరంగ వైభవంగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. నాట్స్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలుగువారి నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కన్వీనర్ శ్రీధర్ అప్పసాని అన్నారు. తెలుగు ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని ఎప్పుడూ నిలబెట్టేలా తాము శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. సంబరాల అంటే కేవలం విందు, వినోదమే కాకుండా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సాటి వారికి సాయం చేసేలా సేవా దృక్పథం.. ఇవన్నీ కలగలసి ఉంటాయని శ్రీధర్ అప్పసాని అన్నారు. ఆదరణకు నోచుకోని, మరుగున పడుతున్న కళలను, కళాకారులను ప్రోత్సహించనున్నామని శ్రీధర్ తెలిపారు.
కేవలం పది రోజుల క్రితమే నాట్స్ ఇచ్చిన పిలుపుకు వందల మంది కిక్ ఆఫ్ ఈవెంట్‌కు తరలిరావడం ఆనందంగా ఉందన్నారు. ఇది అమెరికా తెలుగు సంబరాలకు కేవలం టీజర్ మాత్రమేనన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
రాజ్ అల్లాడ, శ్రీహరి మందాడి, శ్యాం నాళం, మురళీ కృష్ణ మేడిచెర్ల, కృష్ణ అనుమోలు, కవితా తోటకూర, గాయత్రీ, బిందు యలమంచిలి, శ్రీనివాస్ భీమినేని మరియు ఇతర సంబరాలు టీం సభ్యుల సమిష్టి కృషి వల్లే ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతం అయిందని శ్రీధర్ అప్పసాని తెలిపారు. నాట్స్ డాక్యుమెంటరీ కోసం అడిగిన వెంటనే వాయిస్ ఇచ్చిన ప్రముఖ నటులు పూడిపెద్ది సాయికుమార్‌కి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని శ్రీధర్ అప్పసాని అన్నారు.
కిక్ ఆఫ్ ఈవెంట్ స్ఫూర్తితో నాట్స్ సభ్యులంతా కలిసి ఏడవ అమెరికా తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీధర్ అప్పసాని హామీ ఇచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి, నాట్స్ చైర్ వుమన్ అరుణ గంటి, డిప్యూటీ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, బోర్డు సెక్రటరీ శ్యామ్ నాళం, నాట్స్ గౌరవ బోర్డ్ సభ్యులు డా.రవి ఆలపాటి, శేఖరం కొత్త, బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ రాజ్ అల్లాడ, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, వంశీకృష్ణ వెనిగళ్ల, చంద్రశేఖర్ వెనిగళ్ల, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ రంజిత్ చాగంటి, నాట్స్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ (మీడియా) మురళీకృష్ణ మేడిచర్ల, వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్ & ఫైనాన్స్) భాను ధూళిపాళ్ల, వైస్ ప్రెసిడెంట్ (ప్రోగ్రామ్స్) హరినాథ్ బుంగటావుల, వైస్ ప్రెసిడెంట్ (సర్వీసెస్), మదన్ పాములపాటి, జోనల్ వైస్ ప్రెసిడెంట్(నార్త్ ఈస్ట్) గురు కిరణ్ దేసు, ఇమ్మిగ్రేషన్ అసిస్టెన్స్ – సూర్య గుత్తికొండ హాజరయ్యారు.
అన్ని తెలుగు సంస్థల నుండీ పలువురు నాయకులు 7 వ అమెరికా తెలుగు సంబరాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తానా, ఆటా, నాటా, టిఎల్ సిఎ, టిఏజిడివి, తాటా, స్థానిక తెలుగు సంస్థలైన తెలుగు కళా సమితి, ఎన్.జే.టి.ఎ, కళావేదిక, ఎస్.పి.బి ల నుండి ప్రతినిధులు కిక్ ఆఫ్ ఈవెంట్‌కు హాజరయ్యారు.