న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్ అనే పురాణాన్ని అచరించడానికి మనస్సు ఉంటె చాలు ప్రదేశం ఎక్కడయినా పర్వాలేదు. ఎడారినాట ప్రాతఃకాల ప్రశాంత వాతావరణంలో సంపూర్ణంగా అథ్యాత్మిక శైలీలో ఒమాన్ లోని వందలాది ప్రవాసీ తెలుగు కుటుంబాలు సహస్ర లింగార్చనను భక్తిశ్రద్ధలతో మరియు కార్తీక వనభోజనాలను ఆత్మీయంగా నిర్వహించారు.
మస్కట్ లో నివసించె ప్రముఖ వేద పండితులు ధర్మపురి విజయకుమార్ అధ్వర్యంలో వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన లింగార్చన కార్యక్రమానికి వేయి కిలో మీటర్ల దూరంలోని సలాలతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి తెలుగు కుటుంబాలు మస్కట్ బర్కాలోని అబూహైతం ఫాంకు వచ్చారు. సోహార్ పారిశ్రామిక పట్టణం నుండి ప్రత్యెక బస్సులలో కూడ పూజలో పాల్గోనడానికి రావడం జరిగింది. ఉదయం ఆరుగంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఏకధాటిగా జరిగిన కార్యక్రమంలో సుమారు మూడు వేలకు పైగా మంది పాల్గోనగా, 21కు పైగా తెలుగు వంటకాలను వడ్డీంచారు.
గత ఏడు సంవత్సరాల నుండి ప్రతి కార్తీక మాసం సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా గత రెండెళ్ళుగా కోవిడ్ నిబంధనల కారణాన నిర్వహించలేదు. కార్యక్రమంలో సినీ నటుడు తనికెళ్ళ భరణి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. వేద శ్లోకాల పఠన పోటీలలో నెగ్గిన పోరాల అగ్రగణ్య నాయుడు, అనన్య తుంగూరి, శ్రీవత్సలలను మరియు రంగవళ్ళీ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన సాహిసిని, సాయి స్మరణ్, ఉదయ్, ఉషా మరియు హర్షిణీలను బహుమతులను ప్రధానం చేసారు. తెలుగు ప్రవాసీ ప్రముఖులు రాందాస్, మధుసూధన్, వెంకట్, అనిల్ కుమార్ తదితరులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.